బాధ్యతగా విధులు నిర్వర్తించాలి


Sat,January 12, 2019 03:13 AM

-సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాసచౌదరి
-జిల్లా పోలీస్ కార్యాలయంలో రిసెప్షనిస్టులకు శిక్షణ
సిరిసిల్ల క్రైం: పోలీస్ వచ్చే ఫిర్యాదుదారులతో రిసెప్షనిస్ట్ బాధ్యతాయుతంగా ఉండాలనీ, ప్రతి ఫిర్యాదుదారుడికి రసీదు ఇవ్వాలని సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాసచౌదరి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ రెసెప్షనిస్ట్ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా, సీఐ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుడు తన సమస్య పరిష్కారం కోసం వస్తారనీ, అదే సమస్య తమకు వస్తే ఎలాంటి స్పందన ఆశిస్తామో, అలాంటి వ్యవహర శైలి ఉండాలన్నారు. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు రాయడం తెలియక బయటవారిని ఆశ్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని బయట వ్యక్తులుగా ఆసరాగా చేసుకుని బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనీ, స్టేషన్ వచ్చే బాధితులకు రాయడం ఎలాగో అర్థం అయ్యేలా వివరించి, వారితోనే పూర్తి చేయించాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదనీ, ప్రజల ఫిర్యాదులపై పోలీసులు బాధ్యతగా ఉండి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా భరోసా కల్పించాలన్నారు. రిసెప్షనిస్ట్ పనితీరును బట్టి ప్రతి నెల రివార్డులు అందిస్తామన్నారు. ప్రజలకు అనుగుణంగా, వారి మనోభావాలను గుర్తించి విధులు నిర్వర్తించడమే ఫ్రెండ్లీ పోలిసింగ్ అని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, ఇందుకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాసచౌదరి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మండలం చంద్రంపేటలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించగా, సీఐ పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, వాహనదారులు అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు కలిగిఉండాలన్నారు. రాత్రివేళలో పోలిస్ పెట్రోలింగ్ పెంచుతామని, భద్రతపై భరోసా నిచ్చారు. గ్రామంలో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో మేము సైతం ద్వారా, ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీటీసీ సూర దేవరాజు, మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, శ్రీనివావాస్ ప్రభుదాస్, బాలయ్య పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...