వెన్నంటి ఉంటా..


Fri,January 11, 2019 01:48 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: రాజన్న ఆలయ ఉద్యోగుల సమస్యల్లో ఎప్పటికప్పుడు పాలుపంచుకొని పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు భరోసా ఇచ్చారు. సంగీత నిలయం లో ఎమ్మెల్యేను రాజన్న ఆలయ ఉద్యోగులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఘనంగా సన్మానించి జ్ఞా పికను అందజేశారు. వేదపండితులు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి మహదాశీర్వచనం చేశారు. ఈ సంద ర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు సమస్యల్లో పాలుపంచుకొని పరిష్కరిస్తానన్నారు. ఆర్చకుల రెగ్యులరైజేషన్‌లో ఉద్యోగులకు సూపర్ న్యూమరరీ పోస్టుల్లో ఇ బ్బందులు ఎదురవుతున్నాయని తెలిపిన వెంటనే పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మ హాశివరాత్రి జాతరను గతంలో కంటే అత్యంత వైభవం గా నిర్వహించాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుం డా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్, ప్రధానాచార్యులు అప్పాల భీమాశంకర్, గోపన్నగారి శంకరయ్య, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈలు శేఖర్, రాంకిషన్‌రావు, పర్యవేక్షకులు తిరుపతిరావు, రాజేశం, శ్రీరాములు, నవీన్, గోలి శ్రీనివాస్, ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పీచర రంగారా వు, అరుణ్, రాజేశ్వర్, తిరుపతి, శివరామ్, కూరగాయల శ్రీనివాస్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌తో సమాలోచనలు
వేములవాడ, నమస్తేతెలంగాణ: ప్రస్తుతం నిర్వ హిస్తున్న గ్రామ పంచాయతీ, రాబోయే పార్లమెం ట్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌తో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సమాలోచనలను జరిపా రు. హైదరాబాద్‌లో కేటీఆర్‌ను రమేశ్‌బాబు గురు వారం మర్యాదపూర్వంగా కలశారు. ఈ సందర్భం గా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. అదేవిధంగా త్వరలో నిర్వహించ బోయే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ల క్ష్యం గా పనిచేయాల్సి ఉన్నందున గ్రామస్థాయి నుంచి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహంచాలని కేటీఆ ర్ సూచించారని రమేశ్‌బాబు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై కూ డా ప్రత్యేకంగా చర్చించారని, రాజన్న సన్నిధిలో జరిగే మహా శివారాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్‌కు సూచించారని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలని జర్మనీలోని ప లు పారిశ్రామిక వేత్తలను కలసిన నివేదికలను కూ డా కేటీఆర్‌కు అందజేసినట్లు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...