త్వరలో ఈ- చలాన్


Fri,January 11, 2019 01:47 AM

సిరిసిల్ల క్రైం: జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు అమలుతోపాటు ప్రమాదాల నివారణ కోసం త్వరలోనే ఈ చాలన్ విధానాన్ని అమలు చేయనున్నామని ఎస్పీరాహుల్ హెగ్డే వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐటీ కోర్, పోలీస్ సిబ్బందికి ఈ చాలన్ అమలు, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సందర్శించిన ఎస్పీ రాహుల్ హెగ్డే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ చాలన్ అనే కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టనున్నామని వివరించారు. దానిపై సిబ్బందికి అవగాహన కల్పించేందుకే ఒకరోజు శిక్షణ అందించామన్నారు. ఈ చాలన్ పద్ధతిని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, నగదు సహిత జరిమానాకు స్వస్తిపలికి, నగదు రహిత అమలుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ చాలన్ వ్యవస్థలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనలను గుర్తించి, వారి ఫొటో తీసి, సదరు వాహనదారుడు ఏ విధమైన ట్రాఫిక్ ఉల్లంఘన చేశాడో ఆ వివరాలను ఆన్‌లైన్ పద్ధతిన నమోదు చేస్తామన్నారు.

రోడ్డు రవాణా శాఖ కంప్యూటర్ సర్వర్ అనుసంధానంతో వాహనదారుడి సమాచారం తెలుసుకొని, వాహనదారుడి సెల్‌ఫోన్‌కు లేదా వాహన యాజమాని సెల్‌ఫోన్ కు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తారని, ట్రాఫిక్ విభాగం నుం చి సందేశం స్వీకరించిన వాహనదారుడు, తాను చెల్లించాల్సిన జరిమానాను మీ సేవ, ఈ-సేవ, టీఎస్ అన్‌లైన్, పేటీఎంల ద్వారా తేలికగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్ అధికారులు ప్రత్యక్షంగా నిర్వహించే తనిఖీల్లో వాహనదారుడు నిబంధననను అతిక్రమిస్తే, సదరు వాహనదారుడికి సమాచారాన్ని ఆన్‌లైన్ పద్ధతితోలనే నమోదు చేసి, అదే రితీలో జరిమానాలను పంపిస్తామని వెల్లడించారు. ఈ చాలన్ ద్వారా రెండు విధాలుగా జరిమానాలు విధిస్తారని, అందులో కాం టాక్ట్ పద్ధతిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనదారులను భౌతికంగా ఆపి, వాహన నంబర్లను టాబ్‌లో నిక్షిప్తం చేసి, ఈ టికెట్ ఇస్తామని వివరించారు. అలా జారీ చేసిన ఈ టికెట్లు మూడు మించినట్లయితే, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాన్ని సీజ్ చేసి అన్ని జరిమానాలను చెల్లించిన తర్వాతనే విడుదల చేస్తామని తెలిపారు. వీడియో, ఫొటోలను కెమెరాల ద్వారా, ట్రాఫిక్ కమాండ్ సెంటర్ పరిధిలో ఉల్లంఘనను చిత్రీకరించి, ఆ డెటాను టీసీసీలోని సర్వర్‌లో భద్రపరిచి, పూర్తి సాక్ష్యాధారాలతో ఈ చాలాన్లను వాహనదారుడి ఇంటికి పంపిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ శిక్షణ శిబిరంలో ఎస్బీ డీఎస్పీ నరహరి, సిఐలు, ఎస్‌ఐలు, ఐటీకోర్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.

317
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...