మొదటి విడత 12 తిరస్కరణ


Fri,January 11, 2019 01:46 AM

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మొదటి విడత నామినేషన్ల ఘట్టంలో పరిశీలన ప్రక్రియ గురు వారం పూర్తయింది. మొత్తం సర్పంచ్, వార్డు స్థానాలకు కలిపి 2,579 నామినేషన్లు రాగా, వివిధ కారణాలతో 12ను తొలగిం చినట్లు యంత్రాంగం తెలిపింది. 2,568 మిగలగా, శనివారం ఉపసంహరణ తర్వాత ఎవరు బరిలో ఉంటారో తేలనున్నది.

జిల్లాలో తొలివిడతగా అయిదు మండలాలలోని 80 గ్రామ పంచాయతీలో 80 సర్పంచు స్థానాలకు 660 నామినేషన్లు, 720 వార్డులకు 1920 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గురువారం రాత్రి వరకు సాగిన నామినేషన్ల పరిశీలనలో వేములవాడ మండలం మరిపల్లి సర్పంచ్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. 11వార్డు స్థానాల సభ్యుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. అందులో బోయినిపల్లి మండలంలో 2వార్డు స్థానాలు, వేములవాడ అర్బన్ మండలంలో 2వార్డు స్థానాలు, వేములవాడ రూరల్ మండలంలో 3వార్డు స్థానాలు, రుద్రంగి మండలంలో 1, చందుర్తి మండలంలో 3 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత 659 సర్పంచు, 1909 వార్డు స్థానాల నామినేషన్లు సరిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...