ప్రభుత్వ బడుల్లో ఉజ్వల భవిష్యత్


Fri,January 11, 2019 01:46 AM

సిరిసిల్ల టౌన్: ప్రభుత్వ బడుల్లో చదివిన వి ద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాలలో సిరిసిల్ల టౌన్‌క్ల బ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోరుముద్ద కార్యక్రమాన్ని ఎస్పీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులకే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. దే శంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిలో అధికశాతం మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని వివరించారు. అనుభవజ్ఙులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ తరగతులు, డిజటల్ బోధన, గ్రంథాలయం త దితర అధునాతన వసతులు అందుబాటులో ఉంటున్నాయన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిస్తారన్నారు. కార్పొరేట్‌కు దీటైన మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న దని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముం దుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఉత్త మ ఫలితాలు సాధించాలన్నారు.

మున్సిపల్ అ ధ్యక్షురాలు సామల పావని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నదని కొనియా డారు. డిజిటల్ తరగతులు, ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ బోధనను అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. చరిత్రలో లేని విధంగా అన్నివర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న సంకల్పంతో గురుకులాలను ఏర్పాటుచేస్తున్నదన్నారు. అనంతరం గోరుముద్ద కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన టౌన్‌క్లబ్ సభ్యుల ను ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ అధ్యక్షురాలు పావని అభినందించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయురాలు భాగ్యరేఖ, టౌన్‌క్లబ్ సభ్యు లు చొప్పదండి ప్రకాశ్, నాగుల సత్యనారాయణ, బుర్ర నారాయణ, ప్రసాద్, కోడం సంజీవ్, బాలసాని అంజాగౌడ్, బండారి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...