నెలరోజుల్లో నీరందించాలి


Thu,January 10, 2019 02:19 AM

-సిరిసిల్లలో మిషన్ భగీరథ పనులు చేయాలి
-పట్టణంలో వార్డుల వారీగా ప్రత్యేక అధికారులు, ఆర్పీల నియామకం
-సమస్యలను తెలుసుకునేందుకు సర్వే
-త్వరితగతినబాధ్యతలను పూర్తిచేస్తే బహుమతులు
-కలెక్టర్ వెంకట్రామరెడ్డి
-సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం
కలెక్టరేట్: నెలరోజుల్లో సిరిసిల్ల పట్టణంలోని ప్రతి కు టుంబానికి ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా నీరందిం చాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. స్థానిక కౌ న్సిలర్ల సహకారంతో ప్రతిబంధకాలను అధిగమించి ప నులు వేగంగా సాగేలా చూడాలన్నారు. పట్టణంలో సా గుతున్న భగీరథ పనుల పురోగతి, పూర్తి చేసేందుకు చే పట్టాల్సిన చర్యలపై పట్టణ కౌన్సిలర్లు, ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజినీర్లు, ప్రత్యేక అధికారులు, మెప్మా రిసోర్స్ పర్సన్లతో జిల్లా కేంద్రంలోని స్వశక్తి పొదుపు భవనంలో కలెక్టర్ బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకు నేందుకు 4 రోజులపాటు మెప్మా, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నామని వివరించారు. ప్ర తిబంధకాలను సర్వే ప్రణాళికలో నమోదు చేయాలన్నా రు.

పైపులైన్ లీకేజీలు, సగం వరకే పూర్తయిన పనులు, పైపులైన్ ఇంకా పొడగించాల్సిన ప్రదేశాలు, రోడ్డు కటింగ్ నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సిన గృహాలు, కొత్తగా ఇవ్వాల్సిన కుటుంబాలు, రోడ్డు పునరుద్ధరణ చేయాల్సిన ప్ర దేశాలు, మెటీరియల్ కొరత, డ్యామేజ్ ఘటనలు తది తర అంశాలను సర్వే ప్రొఫార్మాలో ఆర్పీలు పొందుపరచాలన్నారు. కౌన్సిలర్లతో వార్డు ప్రత్యేక అధికారులు, ఆర్పీలు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలన్నారు. అందుకు రోజువారీ విధులను నెల రోజులపా టు పక్కన పెట్టాలన్నారు. గుత్తేదార్లు మంచి నాణ్యమైన పైపులైన్లు వేయడంతోపాటు తాగునీటి సరఫరాను స్థిరీకరించడం, పంపిణీపై దృష్టి సారించాలన్నారు. టెక్నీషియన్ సంఖ్యను, బృందాల సంఖ్యను పెంచుకుని 3 దశల్లో పనులను పూర్తి చేయాలని గుత్తేదార్లకు సూచిం చారు. పెంచిన టెక్నీషియన్ జిల్లా యంత్రాంగం తరఫున ఉచిత వసతి కల్పిస్తామని తెలిపారు.

ఆర్పీలకు నగదు ప్రోత్సాహకం..
పట్టణంలో త్వరితగతిన ‘మిషన్ భగీరథ’ను పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరందేలా కృషి చేస్తే ఆర్పీలకు న గదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ప్రథమ బహుమతిగా రూ.25వేలు, ద్వితీయరూ.15 వేలు, తృతీయ రూ.10 వేలు అందిస్తామన్నారు. ప్రత్యేక డ్రైవ్ భాగస్వామ్యమయ్యే ఆర్పీలకు ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదును వెంటనే అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
జీఐ పైపుల వినియోగం..
మిషన్ భగీరథలో ఉపయోగిస్తున్న బ్లూ పైపు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్న దృష్ట్యా పరిష్కారమార్గంగా గాల్వనైజ్ ఐరన్ (జీఐ)పైపులను ఉపయోగించేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారన్నా రు. ఆయన సహకారంతో నీటి సరఫరాలో ఎదురైన ఇ బ్బందులను దూరం చేస్తామన్నారు. సమావేశంలో ము న్సిపల్ అధ్యక్షురాలు పావని, పీఆర్ ఈఈ చిన్నారావు, కమిషనర్ రమణాచారి, ఏడీ అశోక్ పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...