సిరిసిల్లలో కైట్ ఫెస్టివల్


Thu,January 10, 2019 02:17 AM

- 12న బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహణ
-ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలి
-మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి
సిరిసిల్ల టౌన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిరిసిల్లలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ భాగంగా ఈనెల 12న బతుకమ్మ ఘాట్ వద్ద కైట్ ఫెస్టివల్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామని తెలిపారు. కైట్ ఫెస్టివల్ పాల్గొనేందుకు హైదరాబాద్ చెందిన కైట్ టీం సభ్యులు రానున్నారని చెప్పారు. సైక్లింగ్, టాయ్స్, యానిమల్స్ భారీ మోడల్ పతంగుల ప్రదర్శన ఉంటుందన్నారు. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు, తెలంగాణ వంటకాల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఆయా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. సమాఖ్య సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ డీఈ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...