కాలువల నిర్మాణానికి సహకరించాలి


Thu,January 10, 2019 02:16 AM

-నిర్వాసితుల త్యాగఫలితమేప్రాజెక్టులు, కాలువల నిర్మాణం
-భూములు కోల్పోతున్న రైతులకు న్యాయబద్ధమైన పరిహారం
-కలెక్టర్ వెంకట్రామరెడ్డి
-ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం
-జేసీ, ఆర్డీవోల సమక్షంలో ధరల నిర్దారణ
కలెక్టరేట్: జిల్లాలో సాగునీటి కాలువల నిర్మాణానికి రైతులు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగునీటి కాలువల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో ఎంఎంఆర్ పూర్తికావడం, రిజర్వాయర్ నిర్మా ణం శరవేగంగా జరుగుతుండడంతో జిల్లాలో సాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగాల ఫలితమే ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ నిల్వఉన్న నీటిని బీడు భూములకు తరలించి సస్యశ్యామలంగా మార్చాలంటే సాగునీటి కాలువల నిర్మాణంతోనే సాధ్యమవున్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి కాలువల నిర్మాణానికి సహకరించాలన్నారు. సంబంధిత మండలాల తహసీల్దార్లు, డీఈఈలు, ఏఈఈలు సర్వేయర్లతో కలిసి గ్రామాలకు వెళ్లి రైతులతో నేరుగా ధరలపై చర్చించాలన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం ఉద్దేశం, కాలువల నిర్మాణంతో రైతులకు ఓనగూరే ప్రయోజనాలను విడమరిచి చెప్పాలన్నారు. పారదర్శక విధానంలో న్యాయబద్ధమైన పరిహారం అందిస్తామని చెప్పి, ఒప్పించాలని స్పష్టం చేశారు. అనంతరం జేసీ, ఆర్డీవోల సమక్షంలో రైతులను సమావేశపర్చి, కాలువల ధరలను నిర్ధారించి భూనిర్వాసిత రైతులకు పరిహారం అందించాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియను 30రోజల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రయోజనార్థం ప్రభుత్వం చేపట్టిన సాగునీటి కాలువల నిర్మాణానికి భూనిర్వాసిత రైతులు సహకరించి, జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులు నిండేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర సాగునీటి కాలువల నిర్మాణం, భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక నుంచి ఆర్డీవో, తహసీల్దార్ల ద్వారానే భూసేకరణ జరుపుతామనీ, జిల్లాలో 2వేల ఎకరాల భూసేకరణను త్వరితగతిన జరపాలని మండలం, ప్యాకేజీ, కెనాల్ వారీగా లక్ష్యాలను గుర్తించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఏజెన్సీ సర్వేలు, ప్రభుత్వ సర్వేయర్ కలిసి సంయుక్తంగా సర్వే చేపట్టి భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. అందుకు టీమ్ సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ సూచించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ రాహుల్ ఆర్డీవో టి.శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ ఆనంద్, ఈఈలు, డీఈఈలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...