ముగిసిన నామినేషన్ల పర్వం


Thu,January 10, 2019 02:16 AM

వేములవాడ రూరల్ : వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటి వరకు వేములవాడ అర్బన్ మండలంలో 11 గ్రామాలకు 104 సర్పంచ్ పదవికి నామినేషన్లు రాగా 104 వార్డు పదవులకు 333 నామినేషన్లు వచ్చాయి. అలాగే వేములవాడ రూరల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలకు 243 సర్పంచ్ నామినేషన్లు, 146 వార్డు పదవులకు 703 నామినేషను దా ఖలయ్యాయి. చివరి రోజు సర్పంచ్ వేములవాడ అర్బన్ 57 సర్పంచ్ 244 వార్డు సభ్యులకు నామినేషన్లు రాగా వేములవాడ రూరల్ మండలంలో 164 సర్పంచ్ 536 వార్డు పదవులకు నామినేషన్లు వచ్చాయి. నాగయ్యపల్లి, హన్మాజీపేటలో రాత్రి 8 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.

బోయినపల్లి : మండలంలో సర్పంచ్ అభ్యర్థులకు వార్డు మెంబర్లకు బుధవారం భారీసంఖ్యలో అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేశారు. 23 గ్రామాల్లో 220 మంది సర్పం చ్ అభ్యర్థులకు, 640 వార్డు మెంబర్ అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో నల్ల రాజేందర్ తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులుగా కోరెంలో చెన్నాడి రాజ్యలక్ష్మి, చెన్నాడి అరుంధతి, నర్సింగోజు ప్రమీల, తీపిరెడ్డి పద్మ, బూర్గుపల్లిలో సరోజన, లక్ష్మీరాజం, రవి, దుండ్రపల్లిలో కరుణ, లత, అనంతపల్లిలో సత్యనారాయణరెడ్డి, శోభన్, కమలాకర్, లచ్చయ్య, కొత్తపేటలో ల్యాగ నవిత, ఇల్లందుల రేణుక, మమత, మల్లాపూర్ జంగిలి సంజీవ్, శంకరయ్య, దేవమ్మ, వెంకట్రావ్ నరేశ్, లక్ష్మీరాజం, సురేశ్, నందయ్య, మహేందర్, మణెమ్మ, రమేశ్, మహేందర్, మానువాడలో శ్రీనివాస్, రాజు, రజిత, రాజగోపాల్ పుష్పలత, సంపత్, రాంరెడ్డి, బోయినపల్లిలో అనితాదేవి, శంకరమ్మ, దేశాయిపల్లిలో పెండ్యాల నర్సింహారెడ్డి, గోపాల్ మల్కాపూర్ లక్ష్మణ్, శ్రీనివాస్, ర ఘు, ర వి, మల్లయ్య, నరేశ్, శంకరయ్య, ప్రభాకర్, నరేశ్, కొదురుపాకలో జోగినపల్లి శ్యామలాదేవి, చెన్నమనేని అంజలి, సి ద్దాంతి దివ్య, నాగుల రజిత, పుష్ప, వరదవెల్లిలో విజయలక్ష్మి, ర మ్య, రేణుక, వజ్రవ్వ, నీలోజిపల్లిలో నవీన, స్తంభంపల్లిలో పద్మ, జ్యోతి, గుండన్నపల్లిలో అంజమ్మ, లక్ష్మి, ర త్నంపేటలో రేణుక, పుష్పలత, రామన్నపేటలో మధు, జగ్గారా వుపల్లిలో కంది సౌందర్య, మహాంకాళి సునీత, పొన్నం రేణుక, రేవతి, శోభారాణి, మర్లపేటలో గంగ, శారద, పద్మ, అంజలి, సుకన్య, నర్సింగాపూర్ జోగినపల్లి ప్రేం సా గర్ రామకృష్ణ, లక్ష్మీరాజం, శ్రీనివాస్, విలా సాగర్ అర్చన, దివ్య, అనిత, బుర్ర మంజుల, సుచరి తనా మినేషన్లు దాఖలు చేశారు.

రుద్రంగి: గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్ ప ర్వం సోమవారం నుంచి ప్రారంభంకాగా మండలంలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. మండలంలో మొత్తం నాలుగు క్లస్టర్లు రుద్రంగి, మానాల, బడి తండా, గైదిగుట్టతండాలో ఏర్పాటు చేశారు. మూడవరోజు నామినేషన్లు పక్రియ పూర్తయ్యే సరికి రుద్రంగిలో సర్పంచ్ 9, 16 వార్డుల్లో 50, మానాలలో సర్పంచ్ 4, 14 వార్డుల్లో 37 నామినేషన్లు, సర్పంచ్ సర్పంచ్ 2 నామినేషన్లు , 8 వార్డులలో 8, బడి తండాలో సర్పంచ్ 1, 8 వార్డుల లో 8 నామినేషన్లు, చింతమణితండాలో సర్పంచ్ 2 6 వా ర్డుల్లో 6 నామినేషన్లు, రూప్లానాయక్ సర్పంచ్ 1, 8 వార్డుల్లో 8 నామినేషన్లు దాఖలైనట్లు బడితండా రిటర్నింగ్ అధికారి తెలిపారు. గైదిగుట్టతండాలో సర్పంచ్ 3, 6 వార్డుల్లో 8 నామినేషన్లు, అడ్డాబోర్ సర్పంచ్ 1 నామినేషన్, 6 వార్డుల్లో 6 నామినేషన్లు, దేగావత్ లో సర్పంచ్ ఒక్క నామినేషన్, 8 వార్డుల్లో 8 నామినేషన్లు, వీరునితండాలో సర్పంచ్ 1, 6 వార్డుల్లో 6 నామినేషన్లుదాఖలైనట్లు గైదిగుట్టతండా రిటర్నింగ్ అధికారి తెలిపారు.

చందుర్తి: మండలంలో బుధవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా సర్పంచ్ 120 నామినేషన్లు, వార్డు సభ్యులకు 323 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. 10వ తేదిన స్కూటి, 11న విత్ ఉంటాయని ఆయన తెలిపారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...