నేడే ఆఖరు


Wed,January 9, 2019 03:20 AM

-మొదటి విడత నామినేషన్లకు సాయంత్రంతో ముగియనున్న గడువు
-రెండో రోజూ వెల్లువ
-సర్పంచ్ స్థానాలకు 124 దాఖలు..
- వార్డు స్థానాలకు 428..
-రెండు రోజుల్లో మొత్తం 762 దాఖలు
చందుర్తి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండోరోజూ నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. మండలవ్యాప్తంగా 12గ్రామాల్లో 30నామినేషన్లు సర్పంచ్ స్థానానికి దాఖలవ్వగా, 19 గ్రామాల్లో 174వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చందుర్తిలో ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ నేతృత్వంలో పొన్నాల అమృతమ్మ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, నర్సింగాపూర్ టీఆర్ మండల అధ్యక్షుడు మరాఠి మల్లిక్ నామినేషన్ వేశారు. అలాగే జోగాపూర్, మూడపల్లి, మర్రిగడ్డ, అనంతపల్లి, ఆశిరెడ్డిపల్లి, మల్యాల, సనుగుల, రామరావుపల్లి, తిమ్మాపూర్, రామన్నపేట, గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 30నామినేషన్లు సర్పంచ్ స్థానానికి దాఖలైనట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. అలాగే 19 గ్రామాల్లో 174 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ వేశారు.
రుద్రంగిలో..
రుద్రంగి: సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. రెండోరోజు రుద్రంగిలో సర్పంచ్ ఒక నామినేన్, 9మంది వార్డు సభ్యుల నామినేషన్లు, మానాలలో సర్పంచ్ రెండు నామినేషన్, బడితండా గ్రామం నుంచి సర్పంచ్ ఒక నామినేన్, గైదిగుట్టతండాలో దెగావత్ తండా గ్రామం నుంచి రెండు వార్డులలో రెండు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

బోయినపల్లిలో..
బోయినపల్లి: మండలంలోని సర్పంచ్ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మల్లాపూర్ ఎంపీపీ సత్తినేని మాధవు, నీలోజిపల్లిలో జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డిలతోపాటు పలువురు టీఆర్ నాయకులు సర్పంచ్ అభ్యర్థుల వెంట ఉండి నామినేషన్లు వేయించారు. మల్లాపూర్ ఇల్లందుల శంకర్, నీలోజిపల్లిలో అనుముల పద్మ, బోయినపల్లిలో గుంటి లతశ్రీ, కోరెంలో నర్సింగోజు ప్రమీలాదేవి బో యినపల్లిలో బొజ్జ లావణ్య, తడగొండలో కనుకమ్మ, భూమయ్య, ఉయ్యాల శ్రీనివాస్, మల్కాపూర్ తిరుపతి, దేశాయిపల్లిలో శ్రీనివాస్ కొత్తపేటలో భవిత, వెంకట్రావ్ నక్క ఉషాలు, లక్ష్మీనారాయణ, మల్లయ్య, మహేందర్, విలాసాగర్ శారద, నర్సింగాపూర్ కనుకయ్య, రాజు, లక్ష్మణ్, కుమారస్వామి, మర్లపేటలో అనిత, బూర్గుపల్లిలో లచ్చయ్య, నవీన్ సౌమ్య, మహేశ్, స్తంభంపల్లిలో శ్రీలత, రామన్నపేటలో శేఖర్, లక్ష్మయ్య, నరేందర్, గుండన్నపల్లిలో కిరణ్ మల్లేశం, కొదురుపాకలో రజిత సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పలు గ్రామాల్లో వార్డు సభ్యులకు 136 నామినేషన్లు దాఖలయ్యాయి.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...