1557 మందిపై అనర్హత వేటు


Wed,January 9, 2019 03:19 AM

-2013 ఎన్నికల్లో లెక్కలు చూపని ఫలితం
-కొరడా ఝలిపించిన ఈసీ
-పంచాయతీ అభ్యర్థుల జాబితా వెల్లడి
- జిల్లాలో సర్పంచులు 177
-వార్డు సభ్యులు 1380
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ:2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలో పోటీ చేసి లెక్కలు చూపని అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కొరఢా ఝలిపించింది. ఎన్నికల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తుంటారు. నిబంధనలకు మించి ఖర్చులు పెట్టి, తీరా వాటి లెక్కలు చూపకుండా తప్పించుకోవాలనుకుంటారు. ఓటమి చెందిన అభ్యర్థులు లెక్కలు చూపకుండా నిరక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారిపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలోని 5 మండలాలకు చెందిన 177 మంది సర్పంచు అభ్యర్థులు, 1380 మంది వార్డు సభ్యులు ఏడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. దీంతో ప్రస్తుతం పోటీ చేస్తున్న వారి గుండెల్లో దఢ పుట్టిస్తోంది.

ప్రలోభాలకు అడ్డుకట్ట..
ఎన్నికల్లో మద్యం, డబ్బు, బహుమతుల పంపకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా వాటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఖర్చులు తగ్గించాలని ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు పెట్టినా అవి ఆచరణలోకి రావడం లేదు. జనాభా లెక్కల ప్రకారం 5 వేల మంది జనాభా దాటిన పంచాయతీలకు రూ.2.50లక్షలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలలో రూ. 1.50లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తూ పోటాపోటీగా ఖర్చులు పెడుతుంటారు. లెక్కల్లో మాత్రం నిబంధనలను దాటనివ్వరు. విందులు, వివిధ రకాల బహుమతులతో ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎన్నికల ఖర్చుల లెక్కలు ఎప్పటి కప్పుడు ఈసీకి చూపించాల్సి ఉంటుంది. ఓటమి పాలయిన అభ్యర్థులు మాత్రం లెక్కలు చూపడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారీపై ఈసీ కొరఢా ఝలిపిస్తున్నది. 2013 పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయిన సర్పంచులు, వార్డు మెంబర్లపై అనర్హత వేటు వేసింది. ఏడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 5 మండలాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యుల జాబితాను వెల్లడించింది.

1,557 మందిపై అనర్హత వేటు..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా పెట్టిన లెక్కల ఖర్చులు ఈసీకి చూపించాల్సి ఉంటుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో చందుర్తి, ఇల్లంతకుంట, బోయినిపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు చెందిన 1557 మంది అభ్యర్థులు తమ లెక్కలు చూపని కారణంగా వారిని అనర్హులుగా ప్రకటించింది. ఏడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదని తేల్చేసింది. అందులో ఇల్లంతకుంట మండలంలో 429 మంది, గంభీరావుపేట మండలం లో 276మంది, ముస్తాబాద్ మండలంలో 248 మంది, బోయినిపల్లి మండలంలో 274 మంది, చందుర్తి మండలంలో 330మంది ఉన్నారు. ఇందులో 177 మంది సర్పంచులుగా పోటీ చేసి ఓటమి చెందిన వారున్నారు. వీరందరినీ ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించింది.
దడ పుట్టిస్తున్న ఈసీ నిర్ణయం
ఎన్నికల్లో పోటీ చేసి లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ వేటు ఆశావహుల్లో దఢ పుట్టిస్తోంది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థి కనీస విద్యార్హత పదో తరగతిగా నిబంధన విధించింది. మరోవైపు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రస్తుతం ఎన్నికల్లో ఎక్కువ శాతం విద్యావంతులే పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలోనే 1557 మందిని అనర్హులుగా ప్రకటించడంతో పస్థుతం పోటీ చేయాలనుకునే వారి గుండల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈసీ విధించిన అనర్హత వేటుతో మరోసారి తప్పులు చేయకుండా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...