గులాబీ గూటికి కోరుకంటి


Tue,January 8, 2019 03:06 AM

-కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి రామగుండం ఎమ్మెల్యే చందర్
-కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
-ఆయన వెంటే జడ్పీటీసీ సంధ్యారాణి, మరో 3వేల మంది నాయకులు, కార్యకర్తలు
- హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా చేరికలు
-పాల్గొన్న మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే సోమారపు
- భారీ సంఖ్యలో తరలిన అభిమానులు
గోదావరిఖని,నమస్తేతెలంగాణ: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎట్టకేలకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. చందర్‌తోపాటు నియోజకవర్గాని కి చెందిన దాదాపు 3వేల మంది పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ జీ వివేక్‌తోపాటు రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో ఆయనను నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో సొంతగూటికి చేరాలని చందర్ పలుమార్లు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా కోరుకంటి చందర్‌ను సోమవారం పార్టీలోకి ఆహ్వనించారు. దీంతో పెద్ద సంఖ్యలో అతని అనుచరులు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌కు తరలివెళ్లారు.

పార్టీలో చేరిన వారిలో రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, తోటేడి శంకర్‌గౌడ్, బీజేపీ కార్పొరేటర్ జనగామ నర్సయ్య, అచ్చే వేణు, చెలుకలపల్లి శ్రీనివాస్, దుర్గం రాజేశం, పాతిపల్లి ఎల్లయ్య, అభిషేక్‌రావు, తస్లిమా భాను, జావిద్‌పాషా, దీటి బాలరాజు, కుమ్మరి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, మేకల సమ్మయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండీ గౌస్, మారుతి, చుక్కల శ్రీనివాస్, బొమ్మగాని తిరుపతి, సీహెచ్ మొగిలి, ఎం. సిరాజోద్దిన్, బిక్కినేని నర్సింగారావు, ముడతనపల్లి సారయ్య, మేడి సదానందం, దాసరి ఎల్లయ్య, కొండ్ర స్టాలిన్, కుంట సాయి, పాతిపెల్లి కావ్య, రవి, పాముకుంట్ల లలిత, భాస్కర్, బక్కి రాజకుమారి, కిషన్, రవినాయక్, బద్రి రజిత, రాజు, తోకల రమేశ్, నూతి తిరుపతి, కేశవగౌడ్, జనగాం స్వామి, మర్రి మధుసూదన్, మద్దెల శ్రీనివాస్, బసవరాజు గంగారాజు, జక్కుల తిరుపతి, జిమ్మిడి మల్లేశ్, హరీశ్, జడ్సన్‌రాజు, నక్క జిమ్మిబాబు, రమేశ్‌రెడ్డి, వీరారెడ్డి, మనోహర్, అజీం, అనుముల కళావతి, జీవన్‌రావు, శ్రీపతిరావు, గనవేణ సంపత్ ముఖ్యులతోపాటు 3వేల మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

భారీగా తరలిన అనుచరులు
రామగుండం ఎమ్మెల్యేగా గెలిచి సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరడానికి వెళ్తున్న కోరుకంటి చందర్ వెంట సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో అతని అనుచరులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. దాదాపు15 బస్సులతో పాటు మరో 150వాహనాల్లో దాదాపు 3వేలమంది గోదావరిఖని ఎమ్మెల్యే కొత్త క్యాంప్ కార్యాలయం నుంచి వెళ్లారు. ఈ సందర్భంగా కోరుకంటికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...