మహిళా సాధికారతే లక్ష్యం


Tue,January 8, 2019 03:04 AM

-సిరిసిల్లలో సహకృత అవగాహన సదస్సులు
-విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం
-మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి
సిరిసిల్ల టౌన్: మహిళా సాధికారత పెంపొందించడమే లక్ష్యంగా సిరిసిల్ల పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి అన్నారు. సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో వైద్యశాఖ, మెప్మా అధికారులు, సహకృత ఫౌండేషన్ నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కమిషనర్ సమావేశ వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన సహకృత ఫౌండేషన్ నిర్వాహకులు సిరిసిల్ల పట్టణంలో వివిధ ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చారని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతో పాటు నిరుద్యోగ నిర్మూలన, మహిళా సాధికారత వీరి ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి రంగా ల్లో మహిళలు, యువతలో చైతన్యం కల్పించేందుకు వార్డు ల వారీగా క్యాంపులు నిర్వహిస్తారని తెలిపారు. మహిళలకు కుట్టుమిషన్‌తోపాటు వివిధ రకాల ఉపాధి రం గాల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య సంబంధిత వివరాల సేకరిస్తారని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పిస్తారన్నారు.

ప్రస్తుతం 80శాతం ఉన్న పట్టణ అక్షరాస్యత శాతాన్ని వందశాతం చేసేందుకు నిరక్షరాస్యత నిర్మూలనకు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగుతల వారిని గుర్తించి, సంపూర్ణ విద్య అందించేందుకు కృషిచేస్తారన్నారు. బడి మానేసిన పిల్లలు తిరిగి బడికి వెళ్లేలా తల్లిదండ్రులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక, సాఫ్ట్‌వేర్ కంపెనీల అనుసందానంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఉచితంగా శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు. వార్డుల వారీగా నిర్వహించే శిబిరాల్లో విద్య, వైద్య, మెప్మా అధికారులను భాగస్వాముల్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ శ్రమించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఫౌండేషన్ నిర్వాహకులు తోట నీలిమ, వంశీ, నిఖిత, విశ్వ, నీరవ్, సాహి ల్, సత్యమిత్‌సింఘ్, హన్మంతు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...