సర్వహంగులతో మినీట్యాంక్ బండ్


Tue,January 8, 2019 03:04 AM

-ఫుట్ సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్
-ట్రాక్‌లెస్ ట్రైన్, ఓపెన్ ఆడిటోరియంల ఏర్పాటు
-11కోట్లతో శరవేగంగా పనులు
-ఉగాదిలోగా అందుబాటులోకి తెస్తాం
-మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని
సిరిసిల్ల టౌన్: ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల కొత్త చెరువును సర్వహంగులతో మినీ ట్యాంక్‌బండ్‌గా నిర్మిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని అన్నారు. సోమవారం కమిషనర్ కేవీ రమణాచారితో కలిసి ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను ఆమె పర్యవేక్షించారు. కొత్త చెరువు సుందరీకరణలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను మ్యాప్ ద్వారా చైర్‌పర్సన్‌కు వివరించారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, 11కోట్లతో కొత్త చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపా రు. రాష్ట్రంలోనే ఆదర్శంగా పనులు జరగాలన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశాల మేరకు చెరువు మధ్యలో ఐలాంట్, అడ్వెంచర్ సైక్లింగ్, పార్కు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ట్రాక్‌లెస్ ట్రైన్, బోటింగ్ ఏర్పాటు పనులు శరవేగంగా చేస్తున్నామన్నారు. బ్రిడ్జిమ్యాన్ అవార్డు గ్రహిత, పద్మశ్రీ గిరీష్ భరద్వాజ్ ద్వారా చెరువు మధ్యలో ఫుట్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నాలుగు ఎకరాలలో పార్కింగ్, హోటళ్లు, ఓపెన్ జిమ్, క్రీడా వస్తువులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, మినీట్యాంక్ బండ్ నిర్మాణంతో అద్భుతాన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తున్నామన్నారు. ఆధునిక వసతులు, విశాలమైన పార్కు, కిలోమీటర్‌కు పైగా బండ్, ట్రైన్, జాకింగ్ ట్రాక్ వంటి అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగాదిలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆయన వెంట డీఈ నరేందర్, టీపీఎస్ అరుణ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...