ప్రణాళికబద్ధంగా చదవాలి


Tue,January 8, 2019 03:04 AM

-ప్రముఖ సైకాలజిస్ట్ నాగేశ్వర్‌రావు
ముస్తాబాద్: విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవి, లక్ష్యసాధనకు పాటుపడాలని ప్రముఖ సైకాలజిస్ట్ గంప నాగేశ్వర్‌రావు అన్నారు. మండ ల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్‌లో సోమవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులకు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిగత వికాశ తరగతుల నిర్వహించగా, నాగేశ్వర్‌రావు హాజరై విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపారు. ఎలా చదువాలి.. ఎంత చదువాలి.. ఏకాగత్ర ఎంత పెంపొందించుకోవాలి.. భయాన్ని ఎలా జయించాలి.. జ్ఞాపకశక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.డీఈవో మాట్లాడుతూ, పరీక్షల్లో అధిక గ్రేడ్ సాధించడానికి బట్టి చదువులకు స్వస్తిచెప్పి, పాఠ్యంశాల్లోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏకాగత్రతో లక్ష్యం వైపు ముందుకుసాగాలని విద్యార్థులను సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో అశోక్‌రావు, రాజయ్య, భారతి ఫౌండేషన్ సమన్వయ కర్త సంపత్‌కుమార్, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...