ఎన్నికల సందడి


Tue,January 8, 2019 03:04 AM

-పద్మశాలీ సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల
-ఈ నెల 11న నామినేషన్లు
-13న ఉపసంహరణ
-17న ఎన్నికలు
-వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి దేవదాసు
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల పట్టణంలో ఎన్నికల సందడి ముందస్తుగా మొదలైంది. పట్టణ పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కోసం సోమవారం ఎన్నికల అధికారి కారంపుడి దేవదాసు షెడ్యూల్ విడుదల చేశారు. స్థానిక పద్మశాలీ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వర కు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. 17న ఉద యం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఎన్నికలు నిర్వస్తామ ప్రకటించారు. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల ప్రకటించనున్నామని తెలిపారు. నామినేషన్ల దా ఖలు చేసేవారు అధ్యక్ష పదవి కోసం 12వేలు, ప్రధాన కార్యదర్శి 10వేలు, ఉపాధ్యక్షుడు (ఇద్దరు) 5వేలు (ఒక్కొక్కరికి), కోశాధికారి 5 వేలు, సహాయ కార్యదర్శి 5వేలు, కార్యనిర్వాహక కార్యదర్శి 5వేలు, డైరెక్టర్లు 33మంది ఒక్కోవార్డు నుంచి ఒక్కరి చొప్పున 2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నిక ల కమిటీ సభ్యులుగా వంగరి నర్సయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, గోనె ఎల్లప్ప, సిరిసిల్ల వెంకటరమణ, మేర్గు శ్రీనివాస్, గాజుల బాలయ్య, గడ్డం విఠల్, గుండ్లపల్లి శ్రీనివాస్, గుండ్లపల్లి పూర్ణచందర్, గుజ్జె తార, కాముని వనిత, సామల పావ ని, సామల దేవదాస్, జిందం చక్రపాణి, గూడూ రి ప్రవీణ్, లగిశెట్టి శ్రీనివాస్, మంచె శ్రీనివాస్, ఆడెపు రవీందర్, కోడం అశోక్, సామల మల్లే శం, కొక్కుల భాస్కర్, మండల సత్యంలు వ్యవహరిస్తారని చెప్పారు. సమావేశంలో కనుకుంట్ల పున్నంచందర్, గుండ్లపల్లి పూర్ణచందర్‌తోపాటు పద్మశాలీ జిల్లా, యువజన సంఘం, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...