మీ వెంటే నేనుంటా..


Thu,December 13, 2018 02:56 AM

-పార్టీ శ్రేణులకు కేటీఆర్ భరోసా
-హైదరాబాద్‌లో రామన్నను కలిసిన రవీందర్‌రావు, నర్సింగారావు, ముఖ్యనాయకులు
-శుభాకాంక్షలు తెలిపి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేత
సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: ఎంత ఉన్నత స్థా యికి ఎదిగినా సిరిసిల్లకు ఎమ్మెల్యేనన్న విషయా న్ని ఎప్పుడూ మర్చిపోనని, రాజకీయంగా జన్మనిచ్చి జిల్లా ప్రజలను, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నా యకుల వెంటే ఎప్పుడూ ఉంటానని కేటీఆర్ భ రోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో రామన్నను టె స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగారావు బుధవారం కలిశారు. అధికారులు అందజేసిన ఎమ్మె ల్యే ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు కృ తజ్ఞతలు తెలిపారు. పోలింగ్ శాతం పెంచడం కోసం క్రియాశీలకంగా పనిచేసిన రవీందర్‌రావు, నర్సింగారావును అభినందించారు. మూడు నెలలుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు కష్టపడ్డారని, అందరినీ గుండెల్లో పెట్టుకుని చూ సుకుంటానని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్ర జలు తనను ఆదరించారని, ప్రత్యేకంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలీ సమాజం, గతంలో ఎన్నడూ లే ని విధంగా ఒక్కతాటిపైకి వచ్చి తనకు మద్దతు ప్రకటించిన సందర్భాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటానని అన్నారు. నేతన్నల కష్టాలను శాశ్వతంగా లేకుండా చేస్తామని పునరుద్ఘాటించారు. రానున్న కొద్దినెలల్లో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తానన్నా రు. కార్యక్రమంలో న్యాయవాది రమణ, సాంకేత్‌రావు, చరణ్‌తేజ, వెంకట్రావు పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...