అభివృద్ధి వైపే పల్లెలు


Wed,October 17, 2018 02:20 AM

-అందుకే టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నాయి..
-పేదలను ధనవంతులుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన..
-వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు
-నాగయ్యపల్లిలో టీఆర్‌ఎస్ ప్రచారం
-రుద్రంగి మండల కార్యకర్తలతో సమావేశం
-పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
-అమాత్యుడిని గెలిపిద్దాం
-బంగారు భవిష్యత్ కోసం కేటీఆర్‌కు అండగా నిలుద్దాం : టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు
వేములవాడరూరల్: గ్రామాలను అన్ని విధా లా అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్ వైపే పల్లెలు నిలబడుతున్నాయని, అందుకే కేసీఆర్‌కు జై కొడుతున్నాయని వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మండలంలోని నాగయ్యపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం గ్రామం లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ ఏ పల్లెకు పో యినా టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుందని పునరుద్ఘాటించారు. కారుగుర్తుకే ఓటేస్తామని, మరోసారి సీఎంగా కేసీఆర్‌ను గెలిపిస్తామని తమకు భరోసాను కల్పిస్తున్నారని వివరించారు. అభివృద్ధి ఇంకా జరగాలన్నా, కొనసాగాలన్నా మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలపించాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ సీసీరోడ్డుతో పాటు మిషన్ భగీరథ, రైతుల బీమా, రైతుబంధు, గొర్రెల పంపిణీ ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప థకాలు ప్రతి ఇంటికీ చేరాయని ఉదహరించారు.

పేదలను ధనవంతులుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనని, వ్యవసాయాన్ని పండుగలా చేసే రోజులు వచ్చాయని తెలిపారు. ఎల్లంపల్లి సాగునీటితో ఈ ప్రాంతంలో ఇప్పటికే రూ.22 వేల ఎకరాలను సాగుచేశారని, వచ్చే కాలంలో లక్ష ఎకరాలను సాగునీరచ్చే నియోజకవర్గంగా వేములవాడ నిలుస్తుందని పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ ప్ర భుత్వం మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో మరిన్ని పథకాలు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రమేశ్‌బాబుకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యాక్షుడు గడ్డం హన్మాండ్లు, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు చెట్టుపల్లి నరేశ్, నాయకులు నర్కుల కిషన్‌రావు, తుంగతుర్తి లక్ష్మణ్‌రావు, పొలాస నరేందర్, కట్కం మల్లేశం, ఏశ తిరుపతి, గుండెకార్ల నరేశ్, చెట్టుపల్లి మల్లేశం, కిశోర్, పర్శరాం, రాజే శం, మల్లేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
వేములవాడ, నమస్తేతెలంగాణ: పట్టణంలోని సంగీత నిలయంలో రుద్రంగి మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్యకార్యకర్తలతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బా బు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రంగి మండలాన్ని రూ.15కోట్ల తో అన్నివిధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్తా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమగ్రాభివృద్ధిని చేసి తీరుతామన్నారు. నూతన మార్కెట్‌యార్డు, తాగునీటికి ఎల్లంపల్లి జలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. గోదావరి జలాలతో అచ్చాయకుంట, నాగారం చెరువు కలికోట చెరువులను నింపి రుద్రంగి మండలంలోని ప్రతీ ఎకరాకు సా గునీరందించి సస్యశ్యామలం చేస్తామని పునరుద్ఘాటించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గట్లమీనయ్య, జడ్పీటీసీ అంబటి గంగాధర్, రైతు సమన్వయసమితి కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మాడిశెట్టి ఆనందం పాల్గొన్నారు.

రమేశ్‌బాబుకు గౌడ కులస్థుల సన్మానం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును ఆయన నివాసంలో చందుర్తి మండలం ఎన్గంటి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువతో సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తమకు అందించిందని వారు ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బూర్గు దేవయ్య, మాజీ అధ్యక్షుడు బూర్గు నారాయణతోపాటు దాదాపు 50మంది గౌడ కులస్థులు పాల్గొన్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...