కంటి వెలుగుకు విశేష స్పందన


Tue,October 16, 2018 01:25 AM

సిరిసిల్ల టౌన్: జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. సోమవారం గణేశ్‌నగర్ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటుచేసిన శిబిరంలో 207మందికి పరీక్షలు చేయగా, 21మందికి అద్దాలు పం పిణీ చేసినట్లు డా.అనిల్, మెడికల్ ఆఫీసర్ రాజశేఖర్ తెలిపారు. భావనారుషినగర్‌లోని తక్షశీల ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో 240మందికి పరీక్షలు చేయగా, 45 మందికి అద్దాలు అందించినట్లు మెడికల్ ఆఫీసర్ సంపత్, డాక్టర్ భానుచందర్ చెప్పారు.

ఇల్లంతకుంట: కంటి వెలుగు శిబిరాలను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ తడుకపెల్లి లక్ష్మి అన్నారు. సోమారంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఆమె కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. గ్రా మంలో రెండు రోజులపాటు నిర్వహించే శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ సూచించారు. కార్యక్రమంలో క్యాంపు ఇన్‌చార్జి వైద్యులు సదానందం, పర్శరాం, నాయకులు భూమయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట: రాజన్నపేటలో ప్రారంభించిన కంటి వెలుగు పథకానికి ప్రజల నుంచి అనుహ్య ఆదరణ లభిస్తున్నది. సోమవారం 223మందికి పరీక్షలు చేసి, పలువురికి అద్దాలు పంపిణీ చేశా రు. ముగ్గురికి ఆపరేషన్ అవరసం ఉన్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ కపిల్‌సాయి, ఆప్తమాలజిస్ట్ ప్రవీణ్, ఏఎన్‌ఎం లు, ఆశా కార్యకర్తలు రజిత, రాణి, మమత, మనుషా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...