అభివృద్ధి ప్రదాత కేసీఆర్


Mon,October 15, 2018 02:25 AM

-పల్లెల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం
-రమేశ్‌బాబుతోనే నియోజకవర్గ అభివృద్ధి
-సంక్షేమ పథకాలపై కార్యకర్తల విస్తృత ప్రచారం
-పలు గ్రామాల్లో జెండా పండుగలు
-ఊరూరా కార్యకర్తలకు ఘన స్వాగతం
వేములవాడ రూరల్: అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ తోనే గ్రామీణ ప్రాంత ప్రజలు టీఆర్‌ఎస్ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రం మహేశ్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ మండలం నూకలమర్రిలో టీఆర్‌ఎస్ పార్టీ జెండావిష్కరణతోపాటు ఇం టింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రం మహేశ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలే తమకు చెబుతున్నారనీ, ముఖ్యంగా వృద్ధులు కేసీఆర్‌ను మరోసారి సీఎం గా గెలిపిస్తామనీ హామీ ఇస్తున్నారని పేర్కొన్నా రు. ప్రతినిత్యం పేదల గురించి ఆలోచించే సీఎం మన కు దొరకడం అదృష్టమన్నారు. రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యు త్, పంట పెట్టుబడి, రైతుబీమా ఇలా అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఏ పల్లెకుపోయిన టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తామని ప్రజల నుంచి స్పందన రావ డం సంతోషకరమన్నారు. అనంతరం గ్రామంలో టీఆర్‌ఎస్ జెండావిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గడ్డం హన్మాండ్లు, వైస్‌ఎంపీపీ పెండ్యాల తిరుపతి, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ గొస్కుల రవి, మాజీ సర్పంచ్ పిట్టల వెంకటేశ్, తుంగతుర్తి లక్ష్మన్‌రావు, నాయకులు దొంతుల అంజనికుమార్, ఈర్యనాయక్, పెండ్యాల శంకర్, మారవని మల్లేశం, శ్రీనివాస్, రెడ్డవేని పర్శరాం, చంద్రయ్య, శ్రీనివాస్ ఉన్నారు.

రమేశ్‌బాబుతోనే అభివృద్ధి
చందుర్తి: వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి చెన్నమనేని రమేశ్‌బాబు చేస్తున్న సేవలు ఘననీయమైనవనీ, వచ్చె ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడేకేనని ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్ అన్నారు. ఆదివారం నర్సింగాపూర్, తిమ్మాపూర్, రామన్నపేట గ్రా మాల్లో టీఆర్‌ఎస్ జెండా పండుగ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేపట్టారు. తిమ్మాపూర్‌లో మహిళలు బతుకమ్మ ఆడి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకలపై ఆడిపాడారు.కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు కావాల్సిందేనన్నారు. కారుగుర్తుకు ఓటు వేసి, రమేశ్‌బాబును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్, నాయకులు రాపెల్లి గంగాధర్, బండి శ్రావణ్, ముద్దసాని వెంకటేశం, పోతరాజు నగేష్, ఏరెడ్డి రాజిరెడ్డి, బొడిగె లస్మయ్య, చింతకుంట భూమయ్య, సంపునూరి మురళి, తదితరులు పాల్గొన్నారు.
రమేశ్‌బాబును గెలిపించండి
మేడిపల్లి: వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు పాటుపడే చెన్నమనేని రమేశ్‌బాబును ఎమ్మెల్యేగా గెలిపించాలని తెరాస యువజన మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి కోరారు. మేడిపల్లి మండలం ఒడ్డ్యాడు గ్రామంలో మహిపాల్‌రెడ్డి ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి, రమేశ్‌బాబును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యేగా రమేశ్‌బాబును గెలిపించడానికి కృషిచేయాలని యూత్ సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...