చారిత్రాత్మకంగా బతుకమ్మ ఏర్పాట్లు


Sun,October 14, 2018 03:03 AM

సిరిసిల్ల టౌన్: తెలంగాణ సాంస్కృతిక పండుగ అయిన బతుకమ్మ వేడుకల కోసం చారిత్రాత్మక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రామరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని మానేరు తీరంలో నిర్మించిన బతుకమ్మ ఘాట్ పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల నిర్మాణం, లైటింగ్, స్థల సేకరణ తదితర పనులను పర్యవేక్షించారు. అనంతరం మున్సిప ల్, మెప్మా, అటవీశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17న జరుగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ(తొలిరోజు) వేడుకలు అన్నిశాఖల అధికారుల సహకారంతో ఘనమైన ఏర్పాట్లు చేసుకున్నామని పేర్కొన్నారు. అంతకు రెండింతలు సద్దుల బతుకమ్మ కోసం శ్రమించాలని సూచించారు. బతుకమ్మఘాట్ ప్రవేశమార్గం వద్ద లైటింగ్ మరింత పెంచాలని తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు నేటి (సోమవారం)లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫుట్‌పాత్ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలని, డివైడర్ల మధ్యలో పూలకుండీలతో అలంకరించాలని చెప్పారు.

ఘాట్ పరిసరాలను 2వేల మొక్కలతో పచ్చదనం నింపాలని తెలిపారు. బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా ఆరు స్థలాలు, దాండియా ఆడేవారి కోసం ఆరు స్థలాలను సిద్ధం చేయాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శన జరిగే వేదిక వద్ద 2వేల మంది కూర్చుకునేందుకు వీలుగా కుర్చీలు సిద్ధం చేయాలన్నారు. మహిళలను వేడుకలలో భారీ సంఖ్యలో భాగస్వాముల్ని చేసేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్స్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణ ఆరు విభాగాల్లో విభజించి చేపట్టాలని తెలిపారు. వాహనాల ట్రాఫిక్, పార్కింగ్‌కు అవసరమైన ఏ ర్పాట్లు చేయాలన్నారు. ఒక రోజు ముందు గా 16న బతుకమ్మ ఏర్పాట్లపై ట్రయల్న్ నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తి నా శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి బతుకమ్మ వేడుకల విజయవంతంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డా.కేవీ రమణాచారి, డీఎఫ్‌వో శ్రీనివాసరావు, ఎఫ్‌ఆర్వో సుష్మారావు, మెప్మా డీఎంసీ సుమలత, మున్సిపల్ డీఈఈ నరేందర్, టీపీఎస్ అన్సారీ, అటవీశాఖ, మున్సిపల్, మెప్మా సిబ్బం ది పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...