అభివృద్ధికే పట్టం కట్టండి


Sun,October 14, 2018 03:02 AM

వేములవాడ రూరల్ : వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రం మహేశ్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని తిప్పాపూర్, వట్టెంల, ఫాజుల్‌నగర్ గ్రామాల్లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు రైతు బంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎల్లంపల్లి నీటిని తీసుకువచ్చిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబుకే దక్కిందన్నారు. బంగారు తెలంగాణ ఒక్క టీఆర్‌ఎస్‌నే సాధ్యమన్నారు. అనంతరం తిప్పాపూర్‌లో ఇంటింటా ప్రచారంతో పాటు వట్టెంల, ఫాజుల్‌నగర్‌లో టీఆర్‌ఎస్ జెండా ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గుడిసె శ్రీకాంత్, టీఆర్‌ఎస్ మండలాధ్యాక్షుడు గడ్డం హన్మాండ్లు, అర్బన్ అధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ గొస్కుల రవి, కో ఆప్షన్ సభ్యులు విన్సేంట్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నీలం శ్రీనివాస్, మాజీ సర్పంచులు గుడిసె విష్ణువర్ధన్, నాయకులు బండారి శ్రీనివాస్, దుర్గం పర్శరాం, గుండెకార్ల నరేశ్, మల్లేశం, పర్శరాం, అరుణ్, సుధాకర్, శ్రీనివాస్, జలేందర్, దేవరాజు, నర్సయ్య, మల్లేశం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి : రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎంపీపీ తిప్పని శ్రీనివాస్ అన్నారు. శనివారం సనుగులలో టీఆర్‌ఎస్ జెండా పండుగను నిర్వహించగా బండపల్లిలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి రమేశ్‌బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడీటీసీ అంబటి గంగాధర్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్, మాజీ ఏఎంసీ చైర్మన్ దప్పుల అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు మరాఠి మల్లిక్, మాదాసు వేణు, కొండా లక్ష్మణ్, లకావత్ చత్రులాల్, గడ్డం రూపేశ్‌రెడ్డి, బొళ్లిపల్లి నాగయ్య, మల్యాల గంగనర్సయ్య, కాసారపు గంగాధర్, భూక్య గబ్బర్‌సింగ్, గడ్డం సత్తిరెడ్డి, బూర్ల రెడ్డి, పొలాస లాల్సాబ్, లింగంపల్లి రాజం, గోగుల బాబు, గడ్డం అంజిరెడ్డి, కొండ సత్యనారాయణ గౌడ్, శనిగారపు పర్శరాములు, ఎండీ మెదీన్, మల్యాల మల్లయ్య, ఎండీ నాసర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ, నమస్తే తెలంగాణ: అభివృద్ధిని కోరుకునే విధంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిపించుకుందాని పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అన్నారపు శ్రీనివాస్, మహిళా నాయకురాలు అన్నారపు ఉమ అన్నారు. శనివారం పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబును గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శైలజా, రాధ, లక్ష్మి, ల త, బుజ్జవ్వ, శారద, సీమ, కవిత, రవి, అరుణ్, హరీశ్, దిలీప్,రాజు, ప్రశాంత్, తదితరులున్నారు.

కోనరావుపేట: మండలంలోని ధర్మారం గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు శనివారం రా త్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ము ఖ్యంగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే అభ్యర్థి రమేశబాబు కృషి చేశారనీ, ప్రతి ఒక్కరూ టీఆర్‌స్‌కు మద్దతుగా నిలుస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. మాజీ ముచ్చర్ల లచ్చవ్వ, టీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...