ఆశీర్వదించండి..మరింత అభివృద్ధి చేస్తాం..


Sat,October 13, 2018 12:37 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజ్ఞప్తి
-ప్రజల నీరాజనం
-ఆయాచోట్ల చేరికల పర్వం
-వేములవాడ నియోజకవర్గంలో రమేశ్ బాబు ప్రచారం
-గాలిపెల్లిలో రసమయి..
-వేములవాడలో చెన్నమనేనికి, ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్‌కు పలువురి మద్దతు
నేను మీ అసెంబ్లీ అభ్యర్థిని. మీ మాజీ ఎమ్మెల్యేను. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. సంక్షేమ ఫలాలను అర్హులకు అందించా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. మరోసారి ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. మరింత అభివృద్ధి చేస్తా.. అంటూ పల్లెపల్లెనా ఓటర్లకు టీఆర్‌ఎస్ శాసన సభా నియోజకవర్గ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తూ అందరి మద్దతూ కూడగడుతున్నారు. శుక్రవారం వేములవాడలో చెన్నమనేని రమేశ్ బాబు, మానకొండూర్, ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో రసమయి బాలకిషన్ ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటికీ వెళ్లి తాము చేసిన అభివృద్ధి పనులను వివరించి, తమను దీవించాలని కోరారు. పలువురు పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి రమేశ్‌బాబు టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

(రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ) జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో జెండా పండుగలు, సమావేశాలతో కార్యకర్తలు ప్రతి ఓటరును కలుస్తూ ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి అంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో మానకొండూరు అభ్యర్థి రసమయి బాలకిషన్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమ నేని రమేశ్‌బాబు సంగీత నిలయంలో చార్వాక వృద్ధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మద్దతు కోరారు. వేములవాడ మండలం కోనాయిపల్లెలో పార్టీ మండలాధ్యక్షుడు గడ్డం హనుమాండ్లు, సీనియర్ నాయకుడు ఎర్రం మహేశ్ ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించి, రమేశ్‌బాబును భారీ మెజార్టీతో గెలి పిస్తామని ప్రకటించారు. కోనరావుపేట మండలానికి చెందిన ముగ్గురు మాజీ సర్పంచులు 100 మంది యువ కులతో కలిసి రమేశ్‌బాబు సక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో మైనార్టీలంతా కలిసి టీఆర్‌ఎస్ పార్టీకి, అభ్యర్థి కేటీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే అదే గుండారం గ్రామంలోని పలు తాండాల గిరిపుత్రలంతా కలిసి కేటీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...