నూతన వాహనాలతో భద్రత మరింత పటిష్టం


Fri,October 12, 2018 01:00 AM

-ప్రతి పోలీస్‌స్టేషన్‌కూ అత్యాధునిక వాహనం
-ఎస్పీ రాహుల్ హెగ్డే
-జిల్లాకు వచ్చిన నూతన పెట్రోలింగ్ కార్లు, బైక్‌లను ప్రారంభించిన ఎస్పీ
-కొత్తగా 13 పెట్రోలింగ్ కార్లు, 6 బైక్‌లు: ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల క్రైం: నూతన వాహనాల రాకతో జిల్లాలో భద్రత, నిఘా మరింత పటిష్టమైనట్లు ఎస్పీ రాహుల్‌హెగ్డే పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా కేటాయించిన 13 పెట్రోలింగ్ ఇన్నోవా కార్లు, బ్లూకోల్ట్ టీం కోసం 6 బైక్‌లు గురువారం జిల్లాకు చేరాయి. ఆ వాహనాలను తంగళ్లపల్లి మం డలం తాడూరులోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్ట్స్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డే జెండా ఊపి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన వాహనాల రాకతో పోలీసుశాఖ సేవలు మరింత చేరువవుతాయన్నారు. అందుకు అనుగుణంగా వేగవంతంగా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు వాహనాలను రాపిడ్ కాప్ సాధనంతో జిల్లా క మాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఐటీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.

100 డయల్ సేవలు కూడా అందిస్తారని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో జిల్లాలోని ప్రతి పోలిస్‌స్టేషన్ అందించిన వాహనాల కండిషన్‌లో ఏవైనా సమస్యలు ఉంటే సత్వరమే ఉన్నత అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని, రక్షిత మార్గంలో నడపాలని తెలిపారు. ఎన్నికల వేళ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు చేరవయ్యేలా విధులను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరహరి, సీఐలు శ్రీనివాస్, విజయ్‌కు మార్, రవీందర్, ఆర్‌ఐ రజనీకాంత్‌తోపాటు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

159
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...