బ్రహ్మచారిణీ నమోస్తుతే..


Fri,October 12, 2018 12:59 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రెండవరోజైన గురువారం అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరించి ప్రత్యేక పూ జలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారలకు మహన్యాసపూర్వక రుధ్రాభిషేకము నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుష్షష్ఠ్యోపచారపూజ, కన్యకాసుహాసిని పూజలను నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అమ్మవారికి లలితా సహస్రనామ సహిత చతుష్షష్ఠ్యోపచార పూజ, కన్యకా సువాసిని పూజ ,అమ్మవారికి బ్రహ్మచారిణి అలంకారముతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు నెమలి వాహనమండపానికి తీసుకువచ్చిపెద్దసేవపై కొలువుదీర్చారు. పూజల్లో ఆలయ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మూడవరోజున..
రాజరాజేశ్వరస్వామివారికి, లక్ష్మీగణపతికి 11 మంది రుత్వికులచే మహన్యాసపూర్వక ఏ కాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవరోజు శుక్రవారం అమ్మవారిని చంద్రఘంటగా అలంకరించి ప్రత్యేక పూజలు జరపనున్నారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...