పంచాయతీ ప్రశాంతం


Thu,October 11, 2018 01:29 AM

సిరిసిల్ల టౌన్ :నాలుగు నెలల క్రితం రాష్ట్ర సర్కారు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. పల్లెలను గాడి పెట్టే లక్ష్యంతో ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని నిర్ణయించింది. నెలకు 15 వేల వేతనంతో నియమించి, మూడేళ్లపాటు పనితీరును గమనించి రెగ్యులర్ చేస్తామని అప్పట్లో ప్రకటించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పేరిట నియామకాలు జరిపేందుకు సిద్ధం కాగా, గత జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. పోస్టులు పెద్దసంఖ్యలో ఉండడంతో నిరుద్యోగులు ముందు నుంచే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారు. ఎంతో మంది కోచింగ్ తీసుకుని మరీ సిద్ధమయ్యారు. ఎక్కడి జిల్లాలో అక్కడి అధికారులే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది.

పోలీసుల బందోబస్తు
పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ కోసం జిల్లాలో బుధవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకు పేపర్ 2 జరిగింది. ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 8640 మంది అభ్యర్థులకు గాను 7853 మంది హాజరుకాగా 787మంది గైర్హాజరయ్యారు. మధా ్యహ్నం నిర్వహించిన రెండవ పేపర్‌కు 8640 మందికి 849మంది గైర్హాజరుకాగా 7791మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా పరీక్ష నిర్వహణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు ఇన్విజిలేటర్లు పకడ్బందీగా విధులు నిర్వహించడంతో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగింది.

162
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...