మహిళలకు కానుకగా బతుకమ్మ ఘాట్


Wed,October 10, 2018 04:36 AM

సిరిసిల్ల టౌన్: మానేరు తీరంలో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను సిరిసిల్ల మహిళలకు అరుదైన కానుకగా అందిస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని అన్నారు. జిల్లా కేంద్రంలో ని ఎస్పీ కార్యాలయం సమీపంలోని మానేరు వాగులో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను మంగళవారం కమిషనర్ డా.కేవీ రమణాచారి, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి చైర్‌పర్సన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ ఘాట్ నిర్మిరించినట్లు చెప్పారు. రూ.కోటి అరవై లక్షలతో నిర్మించిన ఈ బతుకమ్మ ఘాట్ రాష్ట్రంలోనే అతి పెద్దదనీ, ఇంతటి అరుదైన ప్రదేశాన్ని ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైస్‌చైర్మన్ తవుటు కనుకయ్య, మున్సిపల్ విప్ గుండ్లపల్లి పూర్ణచందర్, మెప్మా డిఎంసి సుమలత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరు లు బతుకమ్మ ఘాల్‌ను సందర్శించారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...