పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ఏర్పాట్లు


Wed,October 10, 2018 04:36 AM

సిరిసిల్ల ఎడ్యుకేషన్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహణకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జేఎన్టీయూ స్పెషల్ అధికారి వీరేశం తెలిపారు. బుధవారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు రెండవ పేపర్ పరీక్ష ఉంటుందని వివరించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో 8640 మంది పరీక్షకు హాజరవనున్నారని, అలాగే పరీక్షకు నిమిషం అలస్యమైనా అనుమతించబోమనే నింబంధన వర్తిస్తుందని వెల్లడిం చారు. పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలులో ఉం టుందని వివరించారు. పరీక్షకు సరైన సమయంలో చే రుకోవాలని సూచించారు. ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్యాడ్లు, గడియారాలు, పర్సులు, బ్యాగులు పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని, పరీక్ష రాసిన అభ్యర్థులు తమ క్వశ్చన్ పేపర్‌ను ఇన్విజిలేటర్‌కి ఇవ్వాల్సంది ఉంటుందని సూచించారు. క్వశ్చన్ పేపర్‌పై ఎ లాంటి కోడ్ ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సిందిగా కోరారు. అభ్యర్ధులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి వేముల శేఖర్, రీజనల్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆగ్రహారం ప్రొఫెసర్ శ్రీనివాస్, 24 మంది సూపరింటెండెంట్లు, 24 పరిశీలకులను నియమించినట్లు తెలిపారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...