రేపటి నుంచి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు


Wed,October 10, 2018 04:35 AM

-ఆల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్ వేదికగా రెండ్రోజులు నిర్వహణ
-ఉమ్మడి జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరు
-పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేందర్‌రెడ్డి వెల్లడి
కరీంనగర్ స్పోర్ట్స్: మరో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు కరీంనగర్ వేదిక కానుంది. దేశ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకైన మల్లయుద్ధం (రెజ్లింగ్) రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు 11, 12వ తేదీల్లో కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ- టెక్నోస్కూల్ వేదికగా సాగనున్నాయి. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సాగనున్న ఈ పోటీలకు సంబంధించిన వివరాలను నిర్వహణ కమిటీ చై ర్మన్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్‌రెడ్డి మంగళవారం సా యంత్రం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 13 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు సాగుతున్నాయని, ఈ పోటీల కు రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు, 20 మంది ఆఫీషియల్స్ హాజరవుతున్నారన్నారు.

పురుషుల విభాగంలో ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల విభాగంలో ఫ్రీస్టయిల్ అంశాల్లో వివిధ కేజీలలో పోటీలుంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు ఉచిత భోజన, వసతిని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. విజేతలకు ట్రోఫీలతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గతంలో జాతీయ స్థాయి ఖోఖో, ఫెన్సింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా చరిత్రలో తొలిసారిగా 2005లో రాష్ట్రపోటీలను నిర్వహిస్తే 13 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి నవంబర్ 26 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గొండా లో జరిగే జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. పో టీల విజయవంతానికి పలు విభాగాలకు సంబంధించి నిర్వహణ కమిటీలను వేసినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కా ర్యదర్శి మహ్మద్ కరీం, జూడో, యోగా సంఘం కార్యదర్శులు గసిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి, నాగిరెడ్డి సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...