దోపిడీ దొంగల మహాకూటమి


Tue,October 9, 2018 01:09 AM

బోయినపల్లి: రాష్ట్ర ఏర్పాటుకు ముందు దో చుకున్న దోపిడీ దొంగలందరూ కలిసి ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడ్డారని టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనె కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలు అనైతిక పొ త్తులు పెట్టుకున్నాయని విమర్శించారు. మండలంలోని అనంతపల్లి గ్రామంలో సోమవా రం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని, ప్రజాదరణను ఏనాడో కోల్పోయాయని అందుకే మహాకూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవాచేశారు. ఆ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసిందని కొనియాడారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మ రథం పడుతున్నారని వివరించారు. ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమని, మహాకూటమి అభ్యర్థులకు డి పాజిట్లు గల్లంతవుతాయని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఎంపీటీసీ వంగపల్లి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్, చందు తదితరులు పాల్గొన్నారు.

బూర్గుపల్లి, బోయినపల్లిలో..
అనంతపల్లితో పాటు బూర్గుపల్లి, బోయినపల్లి గ్రామాల్లోని ముఖ్యమైన టీఆర్‌ఎస్ నాయకులను టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ కలిశారు. టీఆర్‌ఎస్ గెలుపునకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.

డీసీఎంఎస్ చైర్మన్‌తో సమాలోచనలు
మండలపరిషత్ కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డితో కలసి సుంకె రవిశంకర్ సమాలోచనలు చేశారు. జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఇతర నాయకులు కలసి టీఆర్‌ఎస్ విజయానికి రాజకీయ సమలోచనలతో పాటు గ్రామాలకు ఏ విధంగా ఎప్పడు ఎలా వెళ్లాలనేదానిపై రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...