సమస్యలను పరిష్కరించాలి


Mon,October 8, 2018 04:14 AM

హౌసింగ్‌బోర్డుకాలనీ: అగ్రకులాల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య తెలుగు రాష్ర్టాల ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి పోలాడి రామారావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓసీ సంఘాల సమాఖ్య ఉమ్మడి జిల్లా నాయకులతో సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో వెనుకబడిన రెడ్డి , వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి కుల పేదల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఓసీల సంక్షేమానికి రూ.10వేల కోట్లతో ఓసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించి ఓసీ సామాజికవర్గంలో వెనకబడి ఉన్న పేదవారికి సహాయ, సహకారాలు అందించాలన్నారు. ఓసీ స్థితిగతుల ఆధ్యయనానికి చట్టబద్ధతమైన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి నిరుపేదలకు గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఓసీ నిరుపేదలకు వర్తింపజేయాలన్నారు. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా అన్నివర్గాల పేదలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. సమావేశంలో ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వూట్కూరి రాధాకృష్ణరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల కన్వీనర్ చెన్నమేని పురుషోత్తమరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గూడూరి స్వామిరెడ్డి, రాష్ట్ర యూత్ అథ్యక్షుడు గవ్వ వంశీధర్‌రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు ఉట్కూరి రాధాకృష్ణరెడ్డి, జూపల్లి పృధ్వీధర్‌రావు, ఎన్నం కిషన్‌రెడ్డి, నాయకులు జనగామ తిరుపతిరావు, డాక్టర్ దీపక్‌బాబు, కనపర్తి లింగారావు, వేముల సుదర్శన్‌రావు, బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీశ్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...