అక్టోబర్ 3లోగా పూర్తి చేయాలి


Wed,September 19, 2018 03:03 AM

-కలెక్టర్ వెంకట్రామరెడ్డి
కలెక్టరేట్: బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనుల ను అక్టోబరు 3వ తేదీలోగా పూర్తి చేయాలని మున్పిపల్ అధికారులను కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం సమీప మానేరు తీరాన నిర్మిస్తున్న బ తుకమ్మ ఘాట్‌ను కలెక్టర్ మంగళవారం సా యంత్రం సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుద్దీపాల సాయంతో రాత్రివేళా పనులు నిర్విరామంగా చేపట్టాలన్నారు. రేపటికల్లా అవసరమైన మొత్తం సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత బతుకమ్మ ఘాట్ పక్కన తాత్కాలిక వాటర్ బాడి నిర్మించాలన్నారు. 15 వేలకుపైగా మహిళలు, ప్రజలు హాజరవ్వనున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న బతుకమ్మఘాట్ సమీపంలో గ ణపతుల విగ్రహాల నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ట్రాఫిక్ ఇ బ్బందులు తలెత్తకుండా బారికేడ్లను నిర్మా ణం పటిష్టంగా ఉండాలన్నారు.

60 రోజుల్లో దవాఖాన పూర్తికావాలి..
కొత్త బస్టాండు సమీపంలోని రెండు ఎకరాల్లో చేపట్టనున్న ఎల్‌వీ ప్రసాద్ కంటి దవా ఖాన భవన నిర్మాణ పనులు నవంబరు 20వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఎల్‌వీ ప్రసాద్ ప్రతినిధులను కలెక్టర్ వెంకట్రామరెడ్డి కోరారు. కలెక్టరేట్‌లోని తన ఛాం బర్‌లో వైద్యశాల ఏర్పాటుపై ఎల్‌వీ ప్రసాద్ కంటి దవాఖాన ప్రతినిధులు వెల్లంకిరావు, మనోజ్‌కుమార్, జీవీ కుమార్‌తో మంగళవా రం రాత్రి ఆయన చర్చించారు. సిద్దిపేట మా దిరే సిరిసిల్లలో ఎల్‌వీ ప్రసాద్ కంటి దవా ఖాన నిర్మిస్తామని ప్రతినిధులు ఈ సందర్భం గా తెలిపారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ రానున్న 45 రోజుల్లో వైద్యశాలకు అవసరమైన మిషినరీని సమకూర్చుకోవాలన్నారు. నవంబరు 20వ తేదీలోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నా రు. అనంతరం ఎస్పీ రాహుల్‌హెగ్డేతో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ చర్చించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామల పావని, కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...