అభివృద్ధిలో అగ్రభాగాన సిరిసిల్ల


Wed,September 19, 2018 03:03 AM

-సుందరీకరణకు ప్రత్యేక నిధులు
- 32కోట్లతో అభివృద్ధి పనులు
- మున్సిపల్ చైర్‌పర్సన్ పావని
సిరిసిల్ల టౌన్: మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో సిరిసిల్లను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు మున్సిపల్ పాలకవర్గం నిరంతరం శ్రమిస్తున్నదని మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని అన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డు లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా కేంద్రమైన సిరిసిల్ల సుందరీకరణపై మంత్రి ప్రత్యేక దృషిసారించారన్నారు. చరిత్రలో లేనివిధంగా పట్టణంలో అభివృద్ధి పనుల కోసం 32కోట్లు నిధులు మం జూ రు చేశారని తెలిపారు. దశాబ్దాల కాలంలో అభివృద్ధికి నోచుకోని సిరిసిల్లను నాలుగున్నరేళ్లలో చారిత్రాత్మక అభివృద్ధిని చేసిన ఘనత కేటీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఎల్లమ్మ బైపాస్ వద్ద ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటేన్, అంబేద్కర్, గాంధీ చౌరస్తాల సుందరీకరణతోపాటుగా ఎల్‌ఈడీ సెంట ర్ లైటింగ్ తలమానికంగా నిలిచిపోనున్నాయని పేర్కొన్నారు. వెంకట్రావ్‌నగర్, విద్యానగర్‌లలో పార్కుల ఏర్పాటుతో ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సేదతీరుతున్నారన్నారు. అదేవిధంగా కొత్తచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నాయని తెలిపారు. బైపాస్ రోడ్ల ఏర్పాటుతో శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఏళ్ల కాలంగా శ్మశానవాటిక లేక ప్రజలు పడిన కష్టాలు గుర్తించి కోటి నిధులతో ఆధునాతన వైకుంఠధామం నిర్మించారని చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ ఆధ్వర్యంలో యువతకు రుణాలు అందించి, ఉపాధి రం గంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సుందరీకరణ కోసం జరుగుతున్న నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించాలని సూచించారు. లేదంటే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వైస్‌చైర్మన్ తవుటు కనకయ్య, కౌన్సిలర్ బత్తుల వనజ, బత్తుల రమేశ్ పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...