విజయవంతంగా కంటి వెలుగు


Wed,September 19, 2018 03:02 AM

-ఉత్సాహంగా కేంద్రాలకు తరలివస్తున్న ప్రజలు
-ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
-డీఎంహెచ్‌వో మారుతిరావు
-గాలిపెల్లిలో శిబిరం సందర్శన
ఇల్లంతకుంట: పేద ప్రజలకు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు శిబిరం జిల్లా కేంద్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి మారుతిరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని, గాలిపెల్లి ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆశా కార్యకర్తల అవగాహన కల్పించాలన్నారు. మండలంలో ఇప్పటివరకు ఆపరేషన్‌కు రెఫర్ చేసిన వారిని త్వరలో ఆపరేషన్ చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో 90శాతం కంటి పరీక్షలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కంటివెలుగు ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, మండల వైద్యాధికారులు తిరుమల, రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల టౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మంగళవారం ఏర్పాటుచేసిన శిబిరాల్లో గీతానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 305 మంది విద్యార్థులు పరీక్షలు చేసుకోగా, 56మందికి అద్దాలు అందజేశారు. 12మందిని ఆపరేషన్ కోసం డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక అందించినట్లు డా.భాను తెలిపారు. బీవైనగర్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో 306మందిని పరీక్షించగా దగ్గరి, దూరం చూపు సమస్యతో బాధపడుతున్న 52మందికి అద్దాలు ఇచ్చినట్లు డా.అనిల్ చెప్పారు. 20మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేశామన్నారు.

అనూహ్య స్పందన
గంభీరావుపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరానికి అనూహ్య స్పందన వస్తున్నది. మంగళవారం శిబిరంలో జూనియర్ కళాశాల విద్యార్థులు పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో 192మందికి వైద్య పరీక్షలు చేయగా, 68మందికి అద్దాలు అందజేశారు. 13 మందికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించినట్లు వైద్యాధికారి లింబాద్రి తెలిపారు. శిబిరంలో అప్రోలటెక్ వైద్యుడు భాస్కర్, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.

కొరుట్లపేటలో ప్రారంభం
ఎల్లారెడ్డిపేట: మండలంలోని కొరుట్లపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి ధర్మానాయక్ ప్రారంభించారు. మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో, కొరుట్లపేటలో కంటివెలుగు కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. రెండు క్యాంపులు ముగిసే సమయానికి 527మందికి పరీక్షలు నిర్వహించగా, 67మందికి అద్దాలు పంపిణీ చేశారు. 16మంది క్యాటరాక్ట్‌తో బాధపడుతున్నట్లు గు ర్తించామన్నారు. క్యాంపు మెడికల్ ఆఫీసర్ సౌమి ని, ఆప్తమాలజిస్ట్ శ్రీనివాస్, సూపర్‌వైజర్ రషీద్, ఏఎన్‌ఎం భూలక్ష్మి, వినోద, హెల్త్ అసిస్టెంట్ బాబు, మాజీ సర్పంచ్ సింహాద్రి ఆశాకార్యకర్తలు లత, రజిత, కవిత, స్రవంతి, వసంత, లక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...