కంటి వెలుగుకు విశేష స్పందన


Wed,September 19, 2018 03:01 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 13 వైద్యబృందాలు కంటి పరీక్షలను చేస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం 2899 మందికి కంటి పరీక్షలు చేశారు. 471 మందికి కంటి అ ద్దాలు పంపిణీ చేశారు. 120 మందికి మోతె బిందు అపరేషన్లకో సం రేకుర్తి కంటి దవాఖానకు పంపించారు. ఇప్పటి వరకు 55 వేల 032మందికి కంటి పరీక్షలు చేయగా, 11810 మందికి కంటి అద్దాలను అందజేశారు. 3558 మందికి అపరేషన్లు చే యించడానికి రెఫర్ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోడానికి ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివస్తున్నారు. ఆశవర్కర్లు, వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో శిబిరాలకు మంచి స్పందన వస్తుందని అధికారులు తెలిపారు. శిబిరాలను జిల్లా వైద్యాధికారి మారుతిరావు, ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రీరాం, కనుకుట్ల భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...