నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం


Wed,September 19, 2018 03:01 AM

-విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం
-సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు
ముస్తాబాద్: సీఎం కేసీఆర్ కృషితో వినియోగదారులు, రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు పేర్కొన్నారు. ఆవునూర్ గ్రామానికి చెందిన దువాషి చంద్రయ్యకు గల గేదె గత నెలలో విద్యుదాఘాతంతో మృతిచెందగా, మంగళవారం సెస్ సంస్థ ద్వారా మంజూరైన 40వేల నష్ట పరిహారం చెక్కు ను బాధిత కుటుంబానికి మంగళవారం అందజేసి, మాట్లాడారు. గతం లో విద్యుదాఘాతంతో పశువులు మృతిచెందితే నష్ట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరి ఉండేదన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సెస్ పాలకవర్గం జవాబుదారిగా ఉంటూ, బాధితులకు న్యాయం కోసం సత్వర చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. నిరుపేదలకు దీన్‌దయాళ్ పథకం ద్వారా 12కే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రం లో అధికారులు, వినియోగదారుల కోసం అనువైన మోడల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సహకార సం ఘం చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎంసీ చైర్మన్ యాది మల్లేశ్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ము బాలయ్య, నాయకులు బత్తుల అంజయ్య, చేపూరి రాజయ్య, కుంబాల మాల్లారెడ్డి, నక్కదాసరి రవీందర్, గుండం నర్సయ్య, పద్మరెడ్డి పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...