అన్నివర్గాల అభ్యున్నతికి కృషి


Wed,September 19, 2018 03:01 AM

-ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ
-నర్మాలలో కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి భూమి పూజ
గంభీరావుపేట: అన్నివర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ అన్నారు. నర్మాలలో మంగళవారం ఆయా సంఘం భవనాలకు భూమిపూజ చేసి మాట్లాడారు. యాదవ సంఘానికి 2.50లక్షలు, ముదిరాజ్ సంఘం మిగులు పనులకు 3లక్షలు, మండల పరిషత్ పాఠశాలలో రెండు అదనపు తరగతి గదులకు 15లక్షలు మంజూరైనట్లు చెప్పారు. కనుమరుగవుతున్న కులవృత్తులకు జీవం పోసుకుంటూ, ఆయా సంఘాల వారీగా సభ్యులు ఐక్యతగా ఉంటూ అభివృదిద్ధి చెందాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సహకారంతో భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నామని పిలుపునిచ్చారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు కుల సంఘం భవనాలు తోడ్పడుతాయన్నారు. గ్రామాలను అన్నిరంగాల్లో సమగ్ర అభివృద్ధి చేసిన అమాత్యుడికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మా ముద్ద బిడ్డ కేటీఆర్‌కు ముదిరాజ్ సంఘ సభ్యులం మూకుమ్మడిగా అండగా నిలుస్తామంటూ వారు పెద్దఎత్తున కేటీఆర్‌కు జై కొట్టారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ ద్యానబోయిన రాజేందర్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావు, గ్రామశాఖల అధ్యక్షులు అంజనేయులు, రాజనర్సు, మండల టీఆర్‌ఎస్ నేతలు కమ్మరి రాజారాం, నారాయణరావు, చెవుల మల్లేషం, శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్, శివయ్య, అంజయ్య, రాంచంద్రం, ఎల్లం, సురేందర్‌రెడ్డి, లింగంయాదవ్, వెంకటస్వామిగౌడ్, యాదిలాల్, నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...