రుచికరమైన భోజనం అందించాలి


Wed,September 19, 2018 03:00 AM

-ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌శర్మ
ఇల్లంతకుంట: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, పాఠశాల హెచ్‌ఎం కందుకూరి దయానంద్‌కు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా అని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...