నెలాఖరులోగా సీఎం సభ


Tue,September 18, 2018 02:43 AM

-సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట
-లక్ష మందితో నిర్వహణ.. జిల్లావ్యాప్తంగా జనసమీకరణ
-ఆలోపే కార్యకర్తల సమావేశం
-మంత్రి కేటీఆర్ వెల్లడి
సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కలిపి ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండలం గోరింట్యాలలో సోమవారం జరిగిన ఓ శుభకార్యానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యులతో బహిరంగ సభ గురించి చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం, మొహ ర్రం పండుగలు అయిపోగానే సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభ ఉంటుందని స్ప ష్టం చేశారు. రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకే చోట సభ నిర్వహించేలా ఏర్పా ట్లు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారనీ, అందుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రామారావుకు సూచించారు. సిరిసిల్ల, వేములవాడతో పాటు చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని బోయినిపల్లి, మానకొండూర్ నియోజకవర్గపరిధిలోని ఇల్లంతకుంట మండలాల నుంచి సైతం జనం వచ్చేలా చూసుకోవాలన్నారు. వే ములవాడ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు చాలా దూరంగా ఉ న్నందున వారికి అనుకూలంగా ఉండే స్థలాన్ని చూడాలన్నారు. దాదాపు లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభకు 50 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని పరిశీలించాలన్నారు. 20 ఎకరాలు వాహనాల పార్కింగ్ కోసం, మిగతా స్థలం సభాస్థలికి ఉండేలా చూడాలని చెప్పారు. సీఎం సభ కంటే ముందే సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేయాలని, అక్కడే పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. ఆ సమావేశానికి రాష్ట్ర ముఖ్యులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయకులు తోట ఆగయ్య, ప్రవీణ్, జిందం చక్రపాణి, రాజా రాం, శరత్‌రావు, దయాకర్‌రావు, అగ్గిరాములు, మోహన్‌కుమార్, మల్లారెడ్డి, సుభాశ్, సామల పావని, గంగసాయవ్వ, సంపూర్ణ పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...