యోగాతోనే మానసిక ప్రశాంతత


Tue,September 18, 2018 02:42 AM

-యోగా శాస్ర్తానికి మూల పురుషుడు ఆదియోగి: సద్గురు జగ్గి వాసుదేవ్
-ఎంపీ వినోద్‌తో కలిసి నాగారంలో పర్యటన
- విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థల పరిశీలన
- హాజరైన తాజామాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు
కోనరావుపేట: సమాజంలో మానవుడికి యోగతోనే మా నసిక ప్రశాంతత లభిస్తుందని, దానికి మూలపురుషుడు ఆ దియోగని మర్మజ్ఞుడు, దార్శనీతివేత్త ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ ఉద్బోధించారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కోరిక మేరకు ఆయన స్వ గ్రామమైన నాగారంలో ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించను న్నారు. అందులో భాంగా ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎ మ్మెల్యే రమేశ్‌బాబుతో సద్గురు వాసుదేవ్ నాగారంలో సోమవారం పర్యటించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు అను వైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సద్గురు జగ్గి వాసుదేవ్ మాట్లాడుతూ యోగాశాస్ర్తానికి మూల పురుషుడిగా శివుడిని ఆరాధిస్తారని అన్నారు. ఈశ్వరుడిని దైవంగా ఆదియోగిగా కోలుస్తారని వివరించారు. ముఖ్యంగా మనిషి తన పరిమితులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదనే సం భావ్యతను సద్గురు తెలియజేశారు. ఈ భూమ్మీద మానవ చైతన్యం వికసించేందుకు శివుడు అందించిన గోప్ప సహకారం యోగా అని ప్రవచించారు. సమాజంలో ప్రతి ఒ క్కరూ సమానులేనని, ధనిక, పేద భేదాలు లేకుండా ప్ర శాంతతతో జీవనం సాగించాలని హితోపదేశం చేవారు. మానవ శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచుకోవాడానికి సాధ్యపడే వాటిలో అత్యంత ఉత్తమ శాస్త్రీయమైన విధానం యో గా అని ఉద్ఘాటించారు. ఈ భూమ్మీద ఆనందంలో ఉన్నవారే మంచి మనిషని, ఆనందంగా ఉండేందుకు ఏ మానవిక శాస్ర్తాలు అక్కర్లేదని వివరించారు. విగ్రహ నిర్మాణానికి పొట్టిగుట్ట అనువైన స్థలమని సద్గురు వెల్లడించారు.

సద్గురుకు ఘన స్వాగతం
నాగారం గ్రామానికి హెలికాఫ్టర్‌లో చేరుకున్న సద్గురు జగ్గి వాసుదేవ్‌కు ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ర మేశ్‌బాబు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అం దజేశారు. అనంతరం సద్గురుతో స్థానిక కొదండ రామస్వా మి ఆలయానికి సమీపంలో ఉన్న పొట్టిగుట్టను కాలినడకన సందర్శించారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఏ విధంగా నిర్మించాలి? తదితర అంశాలపై నమూనా మ్యాప్ వేసి ఎంపీకి సద్గురు వివరించారు. ఆదియోగి విగ్రహాన్ని ఫోన్‌లో చూపించారు. వేములవాడ పరిసరాల గురించి సద్గురుకు ఎంపీ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విగ్రహ నిర్మాణ ప్రాంతంలో అటవీశాఖ అధ్వర్యంలో చేపట్టిన హరితహరంలో భాగంగా ఏకబిల్వం మొక్కను సద్గురు వాసుదేవ్ నాటారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా నాగారం..
ఆదియోగి విగ్రహా ప్రతిష్ఠాపనతో ఈ ప్రాంతం రానున్న రాజుల్లో ఆధ్యాత్మిక క్షేత్రంగా మారనుందరన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. దేశంలోని మహనీయుల్లో ఒకరైన సద్గురు వాసుదేవ్ స్వయంగా వచ్చి స్థలాన్ని పరిశీలించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సద్గురు జగ్గి వాసుదేవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసుల భారీ బందోబస్తు
సద్గురు జగ్గి వాసుదేవ్‌నకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ను అనుకులాంగా నిర్మించి అ క్కడి నుంచి గ్రామస్తులు, వీక్షకులుకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా బందోబస్తు కల్పించారు. సీఐ విజయ్‌కుమా ర్, ఎస్‌ఐలు రమేశ్‌నాయక్, రమేశ్, పలువురి సిబ్బందితో స్థల పరిశీలన పూర్తియ్యే వరకు ఇబ్బందులు కలగుకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జేసీ యాస్మిన్ బాషా, డీర్డీవో రవీందర్, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్‌ఎంపీపీ రవీందర్‌గౌడ్, ప్రతిమ వైద్యశాల నిర్వాహకులు వికాస్, మాజీ సర్పంచ్‌లు గోపాడి జ్యోతి, సురేందర్‌రావు, మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్, సింగిల్ విండో చైర్మన్ చంద్రయ్యగౌ డ్, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాఘువరెడ్డి, తహీసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, డీఎఫ్‌వోలు శ్రీనివా స్, వేణుగోపాల్, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...