దేశరక్షణలో భాగస్వాములవ్వాలి


Tue,September 18, 2018 02:41 AM

-సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి
-పాఠ్యాంశాల్లో కెప్టెన్ రఘునందన్‌రావు చరిత్ర
-వర్ధంతి సభలో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
-పాల్గొన్న టెస్కాబ్ చైర్మన్ కొండూరి, ప్రజాప్రతినిధులు
సిరిసిల్లటౌన్: దేశ రక్షణలో యువత భాగస్వాములవ్వాలని, అందుకు సై న్యంలో చేరాలని ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ కొండూరి జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలో కెప్టెన్ విజయరఘునందన్‌రావు వర్ధంతిని సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమా ర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు. తొలుత స్థానిక పాతబస్టాండ్ వద్దనున్న రఘునందన్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సిరిసిల్ల మండ లం చిన్నబోనాల గ్రామానికి చెందిన విజయరఘునందన్‌రావు దేశ రక్షణలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆర్మీ చేపట్టిన అనేక సాహస కార్యక్రమాల్లో పాల్గొని ధీరత్వాన్ని చాటారని, అనతికాలంలోనే కెప్టెన్‌గా అ రుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడి సేవలను నేటి తరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందులో గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ కెప్టెన్ విజయరఘునందన్‌రావు పేరుతో 7వ తరగతి పాఠ్యాంశాల్లో ఆయన ధీరత్వాన్ని చేర్చిందని వివరించారు.

విద్యార్థులు కెప్టెన్ జీవితచరిత్రను స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బ్రిటీష్ పాలనలో తెలంగాణలో ఆర్మీ రెజిమెంట్ ఉండేదని, కానీ స్వాతంత్య్రం ఏర్పడ్డాక మనుకు అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. మళ్లీ రాష్ట్రంలో ఆర్మీ రెజిమెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలను చేపట్టిందని, అందులో భాగం గా ఇప్పటికే పలుమార్లు రక్షణశాఖ మంత్రి, అధికారులకు నివేదిక అందజేశామని వెల్లడించారు. ఎన్నికల అనంతరం తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుచేసుకుందామని ధీమా వ్యక్తం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ బందూకుకు భయపడని గడ్డ సిరిసిల్ల అని అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన రఘునందన్‌రావు ఆర్మీలో కెప్టెన్‌గా అందించిన సేవలు అజరామరమని కొనియాడారు. మహనీయుడు రఘునందర్‌రావును స్ఫూ ర్తిగా తీసుకుని యువత దేశరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ మన ప్రాంతానికి చెంది న రఘునందన్‌రావు దేశభద్రత కోసం శత్రుమూకలతో వీరోచిత పోరాటం చేసి ప్రాణాలను అర్పించారని అన్నారు. ఆ మహనీయుడి చరిత్రను నేటితరానికి అందించేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమాలు, పోరాటాలు, విజయాలకు నిలయమైన సిరిసిల్ల యువ త ఆర్మీలో చేరి తమవంతు సేవలను అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావ ని, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిక్కాల రామారావు, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ తవుటు కనకయ్య, కౌన్సిలర్లు బుర్ర నారాయణగౌడ్, పత్తిపాక పద్మ, రేణుక, గౌడరాజు, సందీప్, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...