నామకరణోత్సవంలో మంత్రి కేటీఆర్


Tue,September 18, 2018 02:41 AM

-ఎంపీటీసీ లక్ష్మణ్ కవల పిల్లలను ఆశీర్వదించిన అమాత్యుడు
-గ్రామస్తులకు ఆప్యాయ పలకరింపు
గంభీరావుపేట: మండలంలోని గోరంటాల ఎంపీటీసీ కొమిరిశెట్టి లక్ష్మణ్ కవల పిల్లలు కొడు కు, కూతురు నామకరణోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీటీసీ లక్ష్మణ్ ఇంటిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కవలలు సాత్విక్‌పటేల్, లక్షితను మంత్రి కేటీఆర్ ఆశీర్వదించారు. టీఆర్‌ఎస్ నేతలు, వారి కుటుం బ సభ్యులతో కలసి మంత్రి కేటీఆర్ భోజనం చే శారు. మంత్రి కేటీఆర్ గోరంటాలకు వస్తున్నారన్న సమాచారం మేరకు భారీగా చేరుకున్న నియోజక వర్గ ప్రజాప్రతినిదులు, పార్టీ నేతలతో మంత్రి ముచ్చటించారు. పలువురు తమ సమస్యలను అమాత్యుడికి ఈ సందర్భంగా విన్నవిం చుకున్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎంపీపీ క మ్మరి గంగసాయవ్వ, సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్, సిరిసిల్ల మున్సిపల్ అధ్యక్షురాలు సామల పా వని, జడ్పీటీసీలు శరత్‌రావు, ఆ గయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు చి క్కాల రామారావు, ప్రవీణ్, మాజీ సర్పంచ్ లతిక, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు దయాకర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రాజేందర్, మండల టీఆర్‌ఎస్ నేతలు రాజా రాం, నారాయణరావు, వివిధ శా ఖల అధికారులు, మండల ఎంపీటీ సీలు, మాజీ సర్పంచ్‌లు, ఆయా గ్రా మాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు, నా యకులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...