కన్నుల పండుగకు బారులు


Tue,September 18, 2018 02:40 AM

గంభీరావుపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరానికి ప్రజలు బారులు తీరుతున్నారు. ఉత్సాహంతో కంటి పరీక్షలు చేయించుకుని మందులు, అద్దాలు తీసుకెళ్తున్నారు. సోమవారం శిబిరంలో 190 మందికి వైద్య పరీక్షలు చేయగా, 80మందికి అద్దాలు అందజేశారు. 18మందికి శస్త్ర చికిత్స అవసరమని గుర్తించినట్లు వైద్యాధికారి లింబాద్రి తెలిపా రు. ఈ శిబిరంలో అప్రోలటెక్ వైద్యుడు భాస్కర్, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.

ఇల్లంతకుంట: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకానికి విశేష ఆదరణ వస్తున్నది. గాలిపెల్లిలో కొనసాగుతున్న శిబిరానికి ప్రజలతోపాటు విద్యార్థులు భారీగా తరలివచ్చి, పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం ఇన్‌చార్జి డాక్టర్ సదానందం మాట్లాడుతూ, ఇప్పటి వరకు 1,398 మందికి కంటి పరీక్షలు చేయగా, 393 మందికి అద్దాలు అందజేశామనీ, 404మందికి అద్దాలు ఆర్డర్ చేశామనీ, 129మందిని ఆపరేషన్‌కు రెఫర్ చేశామన్నారు. కార్యక్రమంలో కంటి డాక్టర్ నర్సిం గం, సిబ్బంది గ్రేస్‌మణి, సంపత్, నయీం, రవి, డీటీ ఆపరేట్ మల్లేశం, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట: కిషన్‌దాస్‌పేటలో సోమవారం నిర్వహించి న కంటివెలుగు శిబిరలో 256మందికి పరీక్షలు చేయగా, 23మందికి అద్దాలు పంపిణీ చేశారు. ఐదుగురు క్యాటరాక్ట్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాగట్లపల్లిలో 291 మందికి పరీక్షలు నిర్వహించి, 44మందికి అద్దాలు పంపిణీ చేశారు. వైద్యాధికారి ధర్మానాయక్, క్యాంపు మెడికల్ ఆఫీ సర్ ఇస్రత్‌ఆలియా, ఆప్తమాలజిస్ట్ శ్రీనివాస్, సూపర్‌వైజర్ రషీద్, ఏఎన్‌ఎం భూలక్ష్మి, వినోద, హెల్త్‌అసిస్టెంట్ బాబు, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...