జెండా వేడుకలు పండుగలా నిర్వహించాలి


Tue,September 18, 2018 02:40 AM

-ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శరత్‌రావు
ముస్తాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణంలో జెండా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించాలని ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, జడ్పీటీసీ జనగామ శరత్‌రావు కోరా రు. జెండావిష్కరణ వేడుకలను పురస్కరించుకుని సోమవారం వారు పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలనీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సర్వగా సుందరగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని గుర్తుచేశారు. సబ్సిడీ గొర్రెలు, రైతుబీమా, రైతుబంధు, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తోపాటు తదితర పథకాలు అమలు చేసిన కేసీఆర్ సర్కార్ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, టీఆర్‌ఎస్ మం డలాధ్యక్షుడు కొమ్ము బాలయ్య, కిషన్‌రావు, బాపురావు, నల్ల నర్సయ్య, అంజిరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...