సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి


Tue,September 18, 2018 02:40 AM

-జడ్పీటీసీ తోట ఆగయ్య
-వెంకటాపూర్‌లో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ
ఎల్లారెడ్డిపేట: సబ్బండవర్ణాల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేసిందని జడ్పీటీ సీ తోట ఆగయ్య అ న్నారు. వెంకటాపూర్ లో సోమవారం ఆయ న గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, మాట్లాడారు. సభలు, సమావేశాలు, పండుగలు జరుపుకునేందుకు కుల సంఘం భవనాలు తోడ్పడుతాయన్నారు. గీత కార్మిక సంఘం భవన నిర్మాణానికి డీఎంఎఎఫ్ ద్వారా 4.6లక్షలు మంజూరు కాగా, సద రు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసినట్లు చెప్పారు. వీటితోపాటు మంత్రి కేటీఆర్ సహకారంతో ఊరూరా శుభకార్యాలు, పండుగలు నిర్వహించుకునేందుకు గాను ప్రగతి ప్రాం గణాలు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుళ్లపల్లి నర్సింహరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రాధారపు శంకర్, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాశ్, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహ న్, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నేతలు పులి రమేశ్, పొన్నాల మంజుల, పొన్నా ల మల్లారెడ్డి, వడ్నాల బాలయ్య, మల్ల య్య, ఎల్లయ్య, రాంరెడ్డి, శ్రీనివాస్‌రావు, కిష్టస్వామి, గంగ ఎల్లయ్య, పరకాల దేవయ్య పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...