అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు


Tue,September 18, 2018 02:40 AM

-టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు
-టీఆర్‌ఎస్‌లోచేరిన 50మంది మైనార్టీలు
గంభీరావుపేట: సబ్బండవర్ణాల సంక్షేమమే లక్ష్యంగా, కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధికి ఆయా పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో సోమవా రం టీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ముఖ్య నేతల సమావేశానికి రవీందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా గ్రామాలకు చెందిన 50మంది మైనార్టీలు టీఆర్‌ఎస్‌లో చేరగా, కొండూరి రవీందర్‌రావు వారి కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండూరి మాట్లడుతూ, దశాబ్దాలుగా జరుగని అభివృద్ధిని కేవలం నాలుగున్నర యేళ్లలో చేసి చూపించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ అమలు చేసిన పథకాలే వారు పార్టీలో చేరడానికి నిదర్శనమన్నారు. ముస్లిం విద్యార్థికి రూ.లక్ష రూపాయులు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రత్యేక గురుకులాలు, షాదీముబారక్ పథకం ద్వారా నిరుపేదల ఆడబిడ్డల పెళ్లికి లక్ష నూటపదహార్లు, మైనార్టీ సంక్షేమ రుణాలు, మహిళల స్వయం ఉపాధఙకి ఉచితంగా కుట్టుమిషన్లు, రంజాన్ పండుగకు పేదలకు దుస్తు లు, నిత్యావసర సామగ్రితో పాటు తదితర వసతులు కల్పిస్తూ ముస్లింల సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఆశీర్వదిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావు, పట్టణాధ్యక్షుడు గంద్యాడపు రాజు, మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్‌అలీ, మాజీ ఎంపీపీ నాగపురి ఎల్లాగౌడ్, చెవుల మల్లేషం, శ్రీకాంత్‌రెడ్డి, హైమద్, వహీద్, ఇబాదుల్లా ఖాన్, సాధిక్, వెంకటస్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...