దేశాభివృద్ధికి పాటుపడాలి


Tue,September 18, 2018 02:39 AM

-వ్యక్తిత్వ వికాస నిపుణుడు జగన్‌మోహన్‌రెడ్డి
సిరిసిల్ల టౌన్: దేశాభివృద్ధికి యువత పాటుపడాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన యూత్ ఇన్‌స్పైర్ కార్యక్రమానికి ఆయన హాజరై, విద్యార్థులకు భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందనీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని సమాన స్థాయిలో గౌరవించాలని సూచించారు. సమాజం లో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతుంటాయనీ, అందులోని మంచిని మాత్రమే గ్రహించాలని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం తమ పై పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇటీవల కాలంలో అధిక శాతం యువత ఇదే సమస్యతో భవిష్యత్‌ను అంధకారం చేసుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆకాంక్ష మేరకు సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అనంతుల శివప్రసాద్, నాగుల సంతోష్‌గౌడ్, గుగ్గిళ్ల జగన్‌గౌడ్, దుర్గా ప్రసాద్, చేపూరి నాగరాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...