రైతు రారాజుగా బతకాలి


Mon,September 17, 2018 03:09 AM

-ఎంపీ వినోద్‌కుమార్, తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
-కోనరావుపేటలో పలు అభివృద్ధి పనులు, వేములవాడలో రైతు బజారు ప్రారంభం
కోనరావుపేట: ప్రతీ రైతు ఆత్మగౌరవంతో రా రాజుగా బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నాలుగేండ్లలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మా ర్పులతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని నిజామాబాద్, కోనరావుపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంబించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. ముఖ్యంగా రైతన్నను అప్పుల ఊబి నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో బతికేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరిస్తుందని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రభుత్వమే రైతు బీమా ప్రీమియం చెల్లించి రైతులకు రూ.5లక్షల బీమా వర్తించేలా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ముమ్మటికి రైతు పక్షపాతేనని తాజా మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పష్టం చేశారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను చేపట్టి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో ఈప్రాంతమంతా సస్యశామ లం కాబోతుందని తెలిపారు. 3టీఎంసీలు నీరు నిల్వ ఉంండడంతో రైతులు మూడు పంటలను సాగు చేసుకుంటరాని తెలిపారు.

భూములను త్యాగం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిమ్మపల్లి మూలవాగు ప్రా జెక్టుకు నీటిని అందించేందుకు లిప్ట్ ఇరిగేషన్ ద్వారా పనులు జరిగేందుకు కాంట్రాక్టు పూర్తి అయిందని తెలిపారు. రైతు పం డించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు రాష్ట్రం లో 26లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు నిల్వ ఉంచేందకు ముందస్తుగా నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్‌లో సబ్ మార్కెట్ యార్డులో భాగంగా రూ.36 లక్షలతో పూర్తయిన కవర్డు ప్లాట్ ఫారంను, మండల కేంద్రంలో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అన్నపూ ర్ణ, సెస్ డైరక్టర్ తిరుపతి, కొలనూర్ సింగిల్ విం డో చైర్మన్ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీలత, ఏఎంసీ వైస్ చైర్మన్ దేవయ్య, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాఘువరెడ్డి, మండల రైతు కమిటీ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, జిల్లా రైతు కమిటీ మెంబర్ శంకర్‌గౌడ్, ఎంపీటీసీలు శోభ, వాణి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎర్రం మహేష్, నరేందర్, డైరక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...