ఓటు హక్కు వినియోగించుకోవాలి


Mon,September 17, 2018 03:08 AM

-అర్హులందరూ 25లోగా వివరాలు అందించాలి
-తహసీల్దార్ సుమచౌదరి
గంభీరావుపేట: 1 జనవరి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు సా మాజిక బాధ్యతగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలని తహసీల్దార్ సుమ చౌదరి అన్నా రు. మండలంలోని ఆయా గ్రామాల్లోని బీఎల్‌వోలు నమోదు చేస్తున్న వివరాలను ఆదివారం ఆమె పరిశీలించారు. బీఎల్‌వోలు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటూ, 18 సంవత్సరాలు నిం డిన వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఇంటింటికి తిరుగుతూ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు తరలిన వారి పేర్లు, చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఓటరు నమోదు, జాబితా శుద్ధీకరణ, విధులు, తదితర అంశాలపై సంబంధిత బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహిస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితో ఆర్‌ఐ ప్రవీణ్, ఆయా గ్రామాల వీఆర్వో లు, బీఎల్‌వోలు ఉన్నారు.
వీర్నపల్లి: అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐకేపీ ఏపీఎం మల్లేశం అన్నారు. ఆదివారం ఆయన కంచర్ల, రంగంపేటలో బీఎల్‌వోలను పరిశీలించి, మాట్లాడారు. అక్టోబర్ 7లోపు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి, 8న ఓటరు లిస్ట్ తుది జాబితాను వెల్లడిస్తామన్నారు.1జనవరి 2018 లోగా 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు అన్‌లైన్‌లో ద్వారా గానీ, బీఎల్‌వోల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. లిస్ట్‌లో తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నామనీ, ఓటరు నమోదులో అభ్యంతరాలుంటే ఈ నెల 25లోగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో మహిళా సం ఘాల సభ్యులకు ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఆయన వెం ట వీఆర్వోలు, బీఎల్‌వోలు ఉన్నారు.
ముస్తాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరుగా నమో దు చేసుకుంటున్నారు. మండల కేం ద్రంతోపాటు గ్రామాల్లో బూత్‌స్థాయి అధికారులు, శని, ఆదివారాల్లో వార్డు వారీగా నిర్వహిస్తున్న ఓటర్ నమోదు లో పేర్ల నమోదు చేసుకుంటున్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...