కష్టపడితేనే బంగారు భవిష్యత్


Mon,September 17, 2018 03:08 AM

-డీసీపీ వెంకటేశ్వర్‌రావు
ముస్తాబాద్: యువత కష్టపడితేనే బంగారు భవిష్యత్ సాధ్యమని మాధపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎరవెల్లి వెంకటేశ్వర్‌రావు అన్నారు. పోత్గల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావు ఆదివారం స్వగ్రామానికి రావడంతో ఆయన్ని పలువురు గ్రామస్తులు, యువజన సం ఘాల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో యువత లక్ష్యంపై దృష్టిపెట్టి కష్టపడితేనే లక్ష్యం చేరుకుంటారన్నారు. చదువులు ఉద్యోగాలకే కాకుండా, సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. యువత సమాజంలో సంప్రదాయాలతోపాటు కష్టపడి చదివితేనే ఉన్నతంగా ఎదిగి, ప్రజల్లో గుర్తింపు పొందుతారన్నారు. కేసీఆర్ సర్కార్ వ్యవసాయనికి పెద్దపీట వేసిందనీ, రైతులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను చిన్నతనంలో ప్రభుత్వ పాఠశాల లో చదివి, వ్యవసాయ పనులు చేశానని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పశువైద్య సహయకులు శ్రీనివాస్‌రావు, వెంకట్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...